పాతాళానికి సెన్సెక్స్, ఆరంభంలోనే 1000 పాయింట్ల పతనం, నిమిషంలో రూ. 5 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: అమెరికా మార్కెట్ల భారీ పతనం ప్రభావం భారత స్టాక్ మార్కెట్ మదుపరుల సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బతీసింది. మంగళవారం ఉదయం ప్రీ ఓపెన్ మార్కెట్ సెషన్ లో 700 పాయింట్ల నష్టాన్ని చూపిన సెన్సెక్స్, 9.15 గంటల సమయంలో ట్రేడింగ్ ప్రారంభం కాగానే 1000 పాయింట్లకు పైగా పడిపోయింది.
ఒక్క నిమిషం వ్యవధిలో 3 శాతానికి పైగా దిగజారిన సెన్సెక్స్ సూచిక, 9.20 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 1,041 పాయింట్లు పడిపోయి 33,715.69 పాయింట్లకు చేరింది.
సోమవారం రూ. 1,47,95,747 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్, మంగళవారం ఉదయం రూ. 5 లక్షల కోట్లకు పైగా దిగజారి రూ. 1,42,51, 795 కోట్లకు చేరింది.

అమెరికా మార్కెట్ల ప్రభావంతో...
స్టాక్ మార్కెట్‌కు సంబంధంచి 2015 తర్వాత ఇవే అత్యంత కనిష్ట స్థాయి సూచీలు. అసలే పన్ను ఆందోళనలతో భారీగా నష్టపోతున్న సూచీలు, అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. భారీగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. మరో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏకంగా 323 పాయింట్లు పడిపోయి 10,343 పాయింట్లకు చేరింది. నిఫ్టీ-50లో ఒక్క కంపెనీ కూడా లాభాల్లో లేకపోవడం గమనార్హం.

ఆర్బీఐ పాలసీ కూడా...
మరోవైపు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. ద్రవ్యోల్బణ భయాలు పెరగడంతో కీలక వడ్డీరేటు అయిన రెపోను పెంచే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో మదుపరులు భయపడుతున్నారు.

ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు ప్రభావం...
అటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు కూడా మార్కెట్లను పడగొడుతోంది. అమెరికా స్టాక్‌మార్కెట్లు డోజోన్స్, ఎస్ అండ్ పీ సూచీలు అతిపెద్ద ఇంట్రాడే పతనాలను నమోదుచేశాయి. వాల్‌స్ట్రీట్ ఎఫెక్ట్‌తో ఆసియన్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. జపాన్ నిక్కీ 4.6 శాతం, ఆస్ట్రేలియన్ షేర్లు 3.0 శాతం క్షీణించాయి. అక్టోబర్ నుంచి ఇవే అత్యంత కనిష్ట స్థాయిలు. దక్షిణ కొరియా షేర్లు కూడా 2 శాతం పడిపోయాయి.

ఇప్పుడు రూపాయి విలువ ఎంతంటే...
టాటా మోటార్స్, వీఈడీఎల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు 5 నుంచి 8 శాతం మేరకు నష్టాల్లో నడుస్తున్నాయి. టాటా మోటార్స్ షేర్లు ఫలితాల ప్రకటన తర్వాత 10 శాతం పైగా క్రాష్ అయ్యాయి. మెటల్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఎక్కువగా నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే దేశీయ రూపాయి విలువ కూడా భారీగా 29 పైసలు బలహీనపడి 64.36 వద్ద ప్రారంభమైంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications