వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్’ను సమీక్షించాలి.. పన్నుల్లో వైవిధ్యాన్ని తొలిగించాలి: నాస్కామ్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'ఫారిన్ టాక్స్ క్రెడిట్' నిబంధనలను సమగ్రంగా సమీక్షించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ కోరారు. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) అమలులో వినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో మాట్లాడుతూ సమర్థవంతంగా 'ఫారిన్ టాక్స్ క్రెడిట్'పై సమగ్రంగా చర్చించాలని కోరారు. దేశీయ, విదేశీ స్టార్టప్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై విభిన్న పన్ను చెల్లింపులను తొలగించాలని కోరారు. వీటితోపాటు విదేశీ పెట్టుబడిదారులపై కంటే దేశీయ పెట్టుబడిదారులపై అధిక పన్ను వసూలు చేయొద్దని అభ్యర్థించారు.

ఇక నగదు చెల్లింపుల కంటే డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత చెల్లింపులు, లావాదేవీలపై అధిక పన్ను విధించొద్దని చంద్రశేఖరన్ కోరారు. నిజమైన 'ఏంజిల్స్' పెట్టుబడిదారులను గుర్తించి 'ఏంజిల్ టాక్స్ విధానం' అమలులోకి తేవాలన్నారు. గత దశాబ్ది కాలంలో ఐటీ పరిశ్రమ ఆరొంతులు పెరిగింది. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో భారీగా ఉపాధి కల్పిస్తున్నదీ ఐటీ రంగంలోనే.

 స్టార్టప్ లపై మ్యాట్ మినహాయించాలని అభ్యర్థనలు

స్టార్టప్ లపై మ్యాట్ మినహాయించాలని అభ్యర్థనలు

100 బిలియన్ల డాలర్లకు పైగా ఎగుమతులు సాధిస్తూ, 39 లక్షల మంది ప్రత్యక్ష మంది ఉద్యోగాలు పొందుతున్న రంగం ఐటీ. ఫారిన్ టాక్స్ క్రెడిట్ ఆప్షన్‌తో అత్యధికంగా రుణ పరపతి పొందేందుకు అనుమతించాలని కోరారు. విదేశీ పెట్టుబడిదారుల స్టార్టప్‌లపై 10 శాతం, స్థానే స్వదేశీ స్టార్టప్ యజమానులపై విధించే 20 శాతం పన్నును సమీక్షించాలని కోరారు. స్టార్టప్‌లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) మినహాయించాలని కోరారు. తద్వారా పర్యావరణ హితమైన వ్యాపారాన్ని బలోపేతం చేయొచ్చునన్నారు.

ఆరేళ్లలో 202 శాతం పెరిగిన సుంకం

ఆరేళ్లలో 202 శాతం పెరిగిన సుంకం

సిగరెట్లపై గత జూలైలో జీఎస్టీ అమలులోకి తెచ్చిన తర్వాత తమపై అదనపు భారం పడుతున్నదని ‘ఐటీసీ' తెలిపింది. సిగరెట్లపై జీఎస్టీ కంపన్సేషన్‌సెస్, 2017లో పెంచిన ఎక్సైజ్ సుంకంతో కలిపి 20 శాతానికి పైగా పన్ను పడుతోంది. గత ఆరేళ్లలో 202 శాతం పన్ను పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనునిత్యం నియంత్రణతో కూడిన వళ్తిళ్లకు తోడు గత ఏడాది జూలై 17న సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం మేరకు సిగరెట్లపై కంపన్సేషన్ టాక్స్ విధించింది. ప్రస్తుతం జీఎస్టీ అమలవుతున్న వస్తువుల్లో సిగరెట్లపైనే అత్యధికంగా 28 శాతం పన్ను శాతం.

ఆర్థికశాఖకు కాలుష్య నియంత్రణ శాఖ కార్యదర్శి మిశ్రా ఇలా

ఆర్థికశాఖకు కాలుష్య నియంత్రణ శాఖ కార్యదర్శి మిశ్రా ఇలా

ప్రతిష్ఠాత్మక నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్ఎసీపీ) కింద నదీ జలాల శుద్ధి ప్రాజెక్టులు, కాలుష్య నియంత్రణకు భారీగా నిధులు కేటాయించాలని పర్యావరణ మంత్రిత్వశాఖ కోరింది. ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాలు, పట్టణాల పరిధిలో వాయు కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ నిధులు ఖర్చు చేయాలని శాఖ లక్ష్యం. నిధుల కొరతతో ఏ పనులు చేపట్టలేకపోతున్నట్లు పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి సీకే మిశ్రా చెప్పారు. 2016 - 17తో పోలిస్తే 2017 - 18లో కేవలం 19 శాతం నిధులు.. 2,675.42 కోట్లు కేటాయించారు. ఎయిర్ క్వాలిటీ నెట్వర్క్ విస్తరించాలని ఎన్ఎసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఐదు కీలక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు.

English summary
New Delhi: IT industry body Nasscom has advocated for a comprehensive review of foreign tax credit norms, while pitching for minimum alternative tax exemption and removal of "differential" tax rates for domestic and foreign start-up investors, as part of its budget wishlist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X