వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘సీటీ’ తగ్గింపు కోసం ఎంఎస్ఎంఈ.. విధానం కోసం విద్యుత్ వాహన రంగం అప్పీల్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏ దేశంలోనైనా పారిశ్రామిక, ఆర్థిక, ఉపాధి కల్పనా రంగానికి వెన్నముక మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ). దేశవ్యాప్తంగా 3.60 కోట్లకు పైగా పారిశ్రామిక యూనిట్లు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో ఒడిదొడుకులు ఉన్నా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నికరంగా ప్రగతి సాధించాయి. అయితే 2016 నవంబర్ ఎనిమిదో తేదీన పెద్దనోట్ల రద్దు, 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలుకు రావడంతో ఈ రంగ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం తేలిగ్గా రుణ పరపతి కల్పించి కార్పొరేట్ టాక్స్ తగ్గించాలని కోరుతున్నది.

మరోవైపు విత్త మంత్రి అరుణ్ జైట్లీ కొత్తగా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారని తెలుస్తున్నది. సౌర విద్యుత్ పరికరాల దిగుమతిపై సేఫ్ గార్డు డ్యూటీ, సైబర్ సెక్యూరిటీ సెస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి కల్పించడానికి 'ఇన్వెస్ట్ మెంట్ అలవెన్స్' పేరిట రెండేళ్లు పన్ను రాయితీ ప్రతిపాదన చురుగ్గా పరిశీలనలో ఉన్నట్లు వినికిడి.

దేశీయ ఎగుమతుల్లో 45 శాతం ఎంఎస్ఎంఈ రంగానివే

దేశీయ ఎగుమతుల్లో 45 శాతం ఎంఎస్ఎంఈ రంగానివే

గతేడాది ఇచ్చిన హామీ అమలు చేయాలని ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ టాక్స్ 30 శాతం విధిస్తున్నారు. దీనికి అదనంగా సెస్, సర్ చార్జీ కలుపుకుంటే 35 శాతానికి చేరుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 25 శాతానికి మించకూడదన్న అభిప్రాయం ఉన్నది. దశలవారీగా కార్పొరేట్ టాక్స్ తగ్గిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకునే దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు. తాజాగా జీఎస్టీ అమలులోకి తెచ్చినా పలు వస్తువులపై వ్యాట్ అమలులో ఉండటం పారిశ్రామికవేత్తలకు మోయలేని భారంగా మారింది. దేశీయ ఎగుమతుల్లో 45 శాతం చిన్న, మధ్య తరహా, సూక్ష్మ తరహా పరిశ్రమల ఉత్పత్తులే. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని శరవేగంగా అభివ్రుద్ధి చేయాలంటే లైసెన్సింగ్ విధానాన్ని సరళతరం చేయాలన్న అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రింటింగ్ పరిశ్రమ కోసం ఒక మిషన్ దిగుమతి చేసుకోవాలంటే సుంకం తగ్గించాలని కోరుతున్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వాలని కూడా అభ్యర్థిస్తున్నారు.

 పన్ను రాయితీలు ఇచ్చేందుకు పీఎంవో ఇలా మార్గాన్వేషణ

పన్ను రాయితీలు ఇచ్చేందుకు పీఎంవో ఇలా మార్గాన్వేషణ

మరో రెండు రోజుల్లో పార్లమెంట్‌లో సార్వత్రిక బడ్జెట్‌ ప్రతిపాదించనుండటంతో స్తబ్ధుగా ఉన్న ప్రైవేట్ రంగ పెట్టుబడులను పునరుద్ధరణకు తాజాగా మరికొన్ని పన్ను రాయితీలను ఇచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తున్నది. దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించాలంటే తయారీ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను చొప్పించి, ఆ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు తెర దించాల్సిన అవసరం ఏర్పడటంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంవో) వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ విషయమై వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తున్నది.

ఇలా ప్రైవేట్ మదుపర్ల ఆకర్షణపై మంత్రి సురేశ్ ప్రభు సూచనలు

ఇలా ప్రైవేట్ మదుపర్ల ఆకర్షణపై మంత్రి సురేశ్ ప్రభు సూచనలు

ప్లాంట్ అండ్ మెషినరీ రంగంలో తాజాగా పెట్టుబడులు పెట్టే వారికి పన్ను రూపంలో ప్రయోజనాన్ని కల్పించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ అలవెన్సును ప్రవేశపెట్టాలన్నది ఆయన సూచనల్లో ఒకటి. ఇటువంటి ప్రోత్సాహకాలను కేవలం రెండు మూడేండ్లు కాకుండా దీర్ఘకాలం పాటు అందజేయాల్సిన అవసరం ఉన్నదని, తద్వారా ఈ ప్రోత్సాహకాలకు అనుగుణంగా ఎక్కువ కాలం పాటు ప్రణాళికలు రూపొందించుకునే వెసులుబాటు వ్యాపారులకు కలుగుతుందని విత్తమంత్రి అరుణ్ జైట్లీకి వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి.

 రూ.100 కోట్ల పెట్టుబడి దాటితే ఇలా ఇన్వెస్ట్ మెంట్ అలవెన్స్

రూ.100 కోట్ల పెట్టుబడి దాటితే ఇలా ఇన్వెస్ట్ మెంట్ అలవెన్స్

ప్రైవేట్ రంగ పెట్టుబడి దారుల్లో ప్లాంట్ అండ్ మెషినరీలో రూ.100 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టేవారికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రెండేళ్ల పాటు ఇదేవిధమైన ప్రయోజనాన్ని కల్పించింది. కొత్త ఆస్తుల కొనుగోలుకు అయ్యే ఖర్చును 15 శాతం తగ్గించడం ద్వారా ఈ ప్రయోజనాన్ని కల్పించింది. ఆ తర్వాత ఈ ప్రయోజనం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణాత్మక నిబంధనలను పొందుపర్చి ఈ పథకాన్ని 2017 మార్చి నెలాఖరు వరకూ పొడిగించడంతో పాటు కనీస పెట్టుబడి పరిమితిని రూ.25 కోట్లకు తగ్గించింది. ఇప్పుడు సురేష్ ప్రభు కూడా ఇదేవిధమైన ప్రతిపాదన చేశారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిస్పందించే అవకాశం ఉంది.

విద్యుత్ వాహన విధానం కోసం ఆటోమొబైల్ రంగం ఎదురుచూపులు

విద్యుత్ వాహన విధానం కోసం ఆటోమొబైల్ రంగం ఎదురుచూపులు

విద్యుత్‌తో నడిచే వాహనాల (ఎలక్ట్రిక్ వెహికల్స్)ను కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం ఈసారి సార్వత్రిక బడ్జెట్‌లో విస్తృతమైన ప్రోత్సాహకాలను ప్రకటించడం ఖాయంగా కనిపిస్తున్నది. విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందజేయవచ్చని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు వీలుగా 2030 సంవత్సరం నాటికి దేశంలో నూటికి నూరు శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేలా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకున్నందున ఈసారి బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నామని ఆ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చే విషయమై ఇప్పటికే ఎంతో మేధోమధనం జరిగింది. కనుక ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే 2018-19 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏదో ఒక ప్రకటన చేయవచ్చు అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం జీఎస్టీలో 12 శాతంగా ఉన్న పన్ను రేటును బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం 5 శాతానికి తగ్గించడంతో పాటు ఈ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఆదాయం పన్నులో ప్రయోజనాలను కల్పించే అవకాశం ఉన్నదని ఆ వర్గాలు అంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ఈ బడ్జెట్ ద్వారా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యమే అయినప్పటికీ, ఈ వాహనాలపై ప్రభుత్వం జీఎస్టీ రేటును తగ్గించాలంటే జీఎస్టీ కౌన్సిల్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.

 జీఎస్టీలో నిర్వచనాలతో ఇలా ఇబ్బందులు

జీఎస్టీలో నిర్వచనాలతో ఇలా ఇబ్బందులు

ఆటోమొబైల్ తయారీదారులపై పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు దేశంలో లాజిస్టిక్ సేవలను మెరుగుపరిచేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో వివిధ రకాల రవాణా (మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్) వాహనాలను ఒకే పన్నురేటు కిందికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. రైలు, రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా సరుకులను చేరవేసే వివిధ రకాల వాహనాలు మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ కేటగిరీలోకి వస్తాయి. అయితే మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్‌కు జీఎస్టీలో ఇచ్చిన నిర్వచనంలో స్పష్టత లోపించడంతో ఆటోమొబైల్ కంపెనీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయమై ఆటోమొబైల్ పారిశ్రామిక సంఘం సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్) వాణిజ్య శాఖలోని లాజిస్టిక్స్ విభాగాన్ని ఆశ్రయించడంతో సార్వత్రిక బడ్జెట్‌కు ముందస్తుగా ఆ శాఖ ఈ ప్రతిపాదన చేసిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

 వైద్య రంగంలో ‘మేకిన్ ఇండియా'కు ఇలా ప్రాధాన్యం

వైద్య రంగంలో ‘మేకిన్ ఇండియా'కు ఇలా ప్రాధాన్యం

దేశీయంగా వస్తువుల తయారీకి ఊతమివ్వాలని సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో కొన్ని రకాల వైద్య పరికరాలపై దిగుమతి సుంకాన్ని పెంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదే గనుక జరిగితే మోదీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై ప్రస్తుతం 7.5 శాతం వరకూ ఉన్న కనీస సుంకాన్ని 5 నుంచి 15 శాతం మేరకు పెంచాలని ఏఐఎంఈడీ (అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ) సహా దేశీయ పారిశ్రామిక రంగం సార్వత్రిక బడ్జెట్‌కు ముందస్తుగా కేంద్రానికి సమర్పించిన విజ్ఞాపన పత్రంలో కోరింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై మూడేండ్లు గడుస్తున్నప్పటికీ దేశంలో వైద్య పరికరాల తయారీ రంగం ఇప్పటికీ తీవ్రమైన కష్ట, నష్టాలను ఎదుర్కొంటున్నదని ఏఐఎంఈడీ ఆ విజ్ఞాపన పత్రంలో కేంద్రానికి వివరించింది.

విత్తమంత్రి జైట్లీకి ఇవీ ఇండో అమెరికన్ బిజినెస్ కౌన్సిల్ అప్పీళ్లు

విత్తమంత్రి జైట్లీకి ఇవీ ఇండో అమెరికన్ బిజినెస్ కౌన్సిల్ అప్పీళ్లు

సేవా రంగంలో పన్ను చెల్లింపులతోపాటు తరుచుగా ‘ఈ - ఫైలింగ్' విధానానికి బదులు ఆరు నెలలకోసారి ఫైలింగ్ దాఖలు చేసే విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఇండో అమెరికా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీఎస్) అప్పీల్ చేసింది. తద్వారా సంస్థాగత పెట్టుబడి దారుల నుంచి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలు కలుగుతుందని జైట్లీకి సమర్పించిన వినతిపత్రంలో కౌన్సిల్ అధ్యక్షుడు నిషా దేశాయి బిశ్వాల్ కోరారు. విదేశీ పెట్టుబడిదారులకు ద్వంద్వ పన్నుల విధానం అమలు చేయొద్దని కోరారు.

సేఫ్ గార్డు డ్యూటీ నుంచి విముక్తి కల్పించండి

సేఫ్ గార్డు డ్యూటీ నుంచి విముక్తి కల్పించండి

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన చిట్ట చివరి బడ్జెట్‌లో కొత్త ఆదాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం కొనుగోలు చేసే ఏ పరికరంపైనైనా విధిస్తున్న సేఫ్ గార్డు డ్యూటీతో దాని ధర తడిసి మోపెడవుతున్నదని, రుణ భారం పెంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నదని సౌర విద్యుత్ ఉత్పాదక రంగం ఆందోళన చెందుతోంది. సౌర విద్యుత్ పరికరాల దిగుమతిపై ప్రతిపాదనలో ఉన్న 70 శాతం సేఫ్ గార్డు డ్యూటీ ఉపసంహరించుకోవాలని కోరుతోంది. ప్రస్తుతం తాము చెల్లించే పన్నులకు అదనంగా ఒక రూపాయి పెంచినా తమ ప్రాజెక్టుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతుందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ ప్రతిపాదన బడ్జెట్‌లో చేరిస్తే రూ.15 వేల కోట్ల విలువైన 3000 - 4000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ప్రాజెక్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. సోలార్ సెల్స్, మాడ్యూల్స్ కొనుగోళ్లు, దిగుమతి విలువే మొత్తం ప్రాజెక్టులో 60 శాతం ఉంటుందని సౌర విద్యుత్ రంగ నిపుణుల ఆందోళన. అకస్మాత్తుగా కేంద్రం తీసుకునే నిర్ణయం వివిధ దశలో ఉన్న ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని క్లీన్ మ్యాక్స్ సోలార్ సంస్థ ఎండి కుల్దీప్ జైన్ తెలిపారు. ప్రతిపాదిత సేఫ్ గార్డు డ్యూటీ అమలులోకి వస్తే ప్రాజెక్టుల వ్యయం 25 శాతం పెరిగితే, విద్యుత్ ఉత్పాదక వ్యయం రూ.3 నుంచి రూ.3.75 వరకు పెరుగుతుందని, వీటిని పట్టించుకునే వారే ఉండరని క్రిసిల్ రేటింగ్స్ చెబుతోంది. ఇది దేశంలోని 14 డిస్కామ్ సంస్థల్లో 10 సంస్థలు కొనుగోలు చేసే సగటు విద్యుత్ ధర కంటే ఎక్కువ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సుబోధ్ రాయ్ తెలిపారు.

 సైబర్ నేరాల నియంత్రణకు నిధి ఏర్పాటే లక్ష్యం

సైబర్ నేరాల నియంత్రణకు నిధి ఏర్పాటే లక్ష్యం

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం.. తమ రెవెన్యూ పెంపొందించుకునే మార్గాలు తీవ్రంగానే అన్వేషిస్తున్నట్లు కనిపిస్తున్నది. అదే నిజమైతే ఇప్పటికే అమలులో ఉన్న జీఎస్టీతోపాటు ఆన్‌లైన్‌లో ఆర్థిక సేవల వినియోగించుకునే పౌరులపై ‘సైబర్ సెక్యూరిటీ సెస్' విధించాలని గతేడాదే ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రి జైట్లీకి సూచించింది. ఇది ఆచరణలోకి వచ్చే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఈ సెస్ ద్వారా రోజురోజుకు పెరుగుతున్న ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ‘నిధి'ని ఏర్పాటు చేయడానికి వీలవుతుందని ఆర్థిక సేవల శాఖ తన సూచనలో పేర్కొన్నట్లు సమాచారం. 2017లో డిజిటల్ చెల్లింపుల్లో 25,817 క్రెడిట్, డెబిల్ కార్డు మోసాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

 విత్త మంత్రికి ఇలా సెకండరీ స్టీల్ మేకర్ల డిమాండ్

విత్త మంత్రికి ఇలా సెకండరీ స్టీల్ మేకర్ల డిమాండ్

స్టీల్ మెల్టింగ్ స్క్రాపింగ్‌ దిగుమతిపైన వసూలు చేస్తున్న 2.5 శాతం సుంకం రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెకండరీ స్టీల్ ఇండస్ట్రీ బాడీ ‘ఆల్ ఇండియా ఇండక్షన్ ఫర్నెస్ అసోసియేషన్ (ఏఐఐఎఫ్ఎ) కోరింది. స్టీల్ స్ర్కాప్‌తో మెతక స్టీల్, స్టెయిన్ లెస్ స్టీల్ పరికరాలు తయారు చేస్తున్నామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కమల్ అగర్వాల్ తెలిపారు. దేశీయంగా సరిపడా స్క్రాప్ అందుబాటులో లేనందు వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో 70 లక్షల టన్నుల స్క్రాప్ దిగుమతి చేసుకుంటున్నామని, దీనికి బదులు దేశీయంగా 2.3 కోట్ల టన్నుల ఉత్పత్తి చేసుకుంటే బాగుంటుందన్నారు. కనుక దిగుమతి సుంకం తగ్గిస్తే తమ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుముఖం పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపిన గణాంకాల ప్రకారమే 2015 - 16లో 52 మెట్రిక్ టన్నుల స్టీల్ స్క్రాప్ నుంచి విద్యుత్ మార్గంలో 28 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తైంది.

English summary
India's Medium, small and micro industry also known as MSME sector creates the back bone of industry. Today more than 36 million units registered under MSMEs provide employment to 120 million people across the country. Despite ups and downs of industry, this sector grew at a steady rate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X