వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదో వెరైటీ: నకిలీ పత్రాలతో గృహ, స్థిరాస్థి రుణాలు: యూకో బ్యాంకులో రూ.19.03 కోట్ల మోసం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశీయ బ్యాంకింగ్ రంగంలో కుంభకోణాలు, మోసాలు నిత్యకృత్యంగా మారాయి. సుమారు రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణంతో కుదేలైన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉదంతంతో పాటు ఇటీవల మరికొన్ని ఇతర బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలను ఇంకా మరువక ముందే తాజాగా యూకో బ్యాంకులో మరో మోసం వెలుగు చూసింది. 2013-16 మధ్య కొంత మంది ఈ బ్యాంకు అధికారులు వేర్వేరు గృహ, స్థిరాస్థి రుణ పథకాల కింద 18 మంది వ్యక్తులకు నకిలీ పత్రాల ఆధారంగా రూ.19.03 కోట్ల రుణాలు మంజూరు చేశారు.

దీనిపై యూకో బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. యూకో బ్యాంకు నుంచి అందిన ఫిర్యాదు మేరకు మార్చి 29వ తేదీన సీబీఐ ఈ కేసు నమోదుచేసి, ఆ బ్యాంకు జయనగర్ శాఖ మాజీ మేనేజర్ కేఆర్ సరోజ సహా ఐదుగురు వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నది.

లేని అర్హతలు కల్పించి ఇంటి, స్థిరాస్థి రుణాలు మంజూరు
బీఎస్ శ్రీనాథ అనే మధ్యవర్తితోపాటు యూకో బ్యాంకుకు అప్రూవ్డ్ వాల్యూవర్లుగా వ్యవహరిస్తున్న జంబూనాథ్, గోపీనాథ్ ఆర్ అగ్నిహోత్రి, ఎన్ వెంకేటష్ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. 2013 ఆగస్టు 26వ తేదీ నుంచి 2016 జూన్ ఒకటో తేదీ వరకూ యూకో బ్యాంకు చీఫ్ మేనేజర్‌ సరోజ హయాంలో శ్రీనాథ్ అనే మధ్యవర్తితో కుమ్మకై గృహ, స్థిరాస్థి రుణ పథకాల కింద 18 మందికి నకిలీ పత్రాల ఆధారంగా రాయితీలపై రుణాలను మంజూరు చేశారు. ఈ విషయంలో బ్యాంకు వాల్యూవర్లు అగ్నిహోత్రి, జంబూనాథ్, వెంకటేష్ అక్రమంగా వ్యవహరించారని, లబ్ధిదారుల ఆస్తుల విలువను అధికంగా చూపి రుణాలు పొందేందుకు వారిని అర్హులుగా మార్చారని, ఆ తర్వాత లబ్ధిదారులు ఈ రుణాలను అసలు పనులకు కాకుండా ఇతర పనులకు ఉపయోగించుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ బ్యాంకు ఆరోపించింది.

CBI Files FIR Against UCO Banks Former Manager, Four Others In Rs. 19 Crore Fraud Case

2014లో 30 లఓల నుంచి 2017లో 1.10 కోట్లకు చేరిన ఫోన్ల ఉత్పత్తి

ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉన్నది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తోపాటు టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హాకు రాసిన లేఖలో ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ (ఐసీఏ) జాతీయ అధ్యక్షులు పంకజ్ మహేంద్రు ఈ సంగతి తెలిపారు. మార్కెట్ పరిశోధనా సంస్థలైన ఐహెచ్‌ఎస్, చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్, వియత్నాం జనరల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ నుంచి లభ్యమైన గణాంకాల ఆధారంగా ఈ సంగతి తెలిపారు. ఈ గణాంకాల ప్రకారం 2014లో భారత్‌లో 30 లక్షల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి కాగా, 2017లో వీటి సంఖ్య 1.10 కోట్ల యూనిట్లకు పెరిగింది.

CBI Files FIR Against UCO Banks Former Manager, Four Others In Rs. 19 Crore Fraud Case

వచ్చే ఏడాది చివరికల్లా 50 కోట్ల మొబైల్ ఫోన్ల ఉత్పత్తే లక్ష్యం

ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన వియత్నాంను అధిగమించి భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నది. మన దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి పెరగడం వలన గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ హ్యాండ్‌సెట్ల దిగుమతులు సగానికి పైగా తగ్గాయి. 2019 చివరి నాటికి 4,600 కోట్ల డాలర్ల విలువైన 50 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతున్నది. దేశంలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వచ్చే ఏడాది చివరి నాటికి 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడంతో పాటు 15 లక్షల డాలర్ల విలువైన 12 కోట్ల మొబైల్ ఫోన్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు పంకజ్ మహేంద్రు తెలిపారు.

CBI Files FIR Against UCO Banks Former Manager, Four Others In Rs. 19 Crore Fraud Case
English summary
The CBI has registered a fresh bank fraud case amounting to Rs.19.03 crore that was sanctioned by UCO Bank to 18 fake borrowers under various home and property loan schemes with concessional interest rates in 2013 and 2016, it was announced on Sunday.The agency's move comes in the wake of a complaint received from UCO Bank on March 27.The Central Bureau of Investigation filed the FIR on March 29 naming five persons, including former UCO Bank Jayanagar's Branch Manager K.R. Saroja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X