క్లెయిమ్ అక్కర్లేదు.. ఖాతాలోనే పీఎఫ్ సొమ్ము: ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్!

సంస్థలు మారినప్పుడు లేదా ఉద్యోగాలు వదిలేసినప్పుడు పాత పీఎఫ్ ఖాతాల్లో మిగిలిపోయే చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకోవడానికి పడుతున్న శ్రమకు ముగింపు పలికేలా ఈపీఎఫ్‌వో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా నిష్క్రియాత్మకంగా పడి ఉన్న పాత పీఎఫ్ ఖాతాల్లో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ సొమ్ము ఉన్నట్లయితే సదరు సభ్యులు ఎటువంటి క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమెటిక్‌గా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 1న ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ నూతన సదుపాయాన్ని అధికారికంగాప్రారంభించారు.

EPFO కొత్త అవతారం.. ఇక వాట్సాప్‌లోనే అన్ని అప్‌డేట్స్!
EPFO కొత్త అవతారం.. ఇక వాట్సాప్‌లోనే అన్ని అప్‌డేట్స్!

ఆటో సెటిల్మెంట్ నిబంధనలు: ఎవరు అర్హులు?
ఈ సదుపాయం ద్వారా ప్రతి ఒక్కరికీ కాకుండా కొన్ని ముఖ్యమైన సాంకేతిక నిబంధనలు పూర్తి చేసుకున్న ఖాతాలకే నేరుగా నగదు జమ అవుతుంది. ఆ అర్హతలు ఇవే.

ఖాతా స్థితి: పీఎఫ్ ఖాతాలో వరుసగా 36 నెలల పాటు ఎటువంటి డిపాజిట్లు జరగకుండా, అకౌంట్ నిష్క్రియాత్మకంగా మారి ఉండాలి.

గరిష్ట పరిమితి: సదరు ఖాతాలో ఉన్న మొత్తం నిల రూ.1000 లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.

ఆధార్ సీడింగ్: పీఎఫ్ ఖాతాతో యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) అనుసంధానమై, తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తయి ఉండాలి.

బ్యాంక్ కేవైసీ తనిఖీ: ఈపీఎఫ్వో వ్యవస్థలు సభ్యుని గుర్తింపు, బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాల తనిఖీలను పూర్తి చేసిన వెంటనే నేరుగా నెఫ్ట్(NEFT) రూపంలో డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.

EPFO Auto-Settlement Scheme Claim-Free PF Withdrawal for Inoperative Accounts Under Rs 1 000

లక్ష ఖాతాలు.. రూ.5 కోట్ల నిధుల పంపిణీ
అవగాహన లోపం వల్లనో లేక రూ.500, రూ.1,000 కోసం పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగడం లేదా ఆన్‌లైన్ క్లెయిమ్స్ పెట్టడం దండగ అనుకోవడం వల్లనో కోట్లాది మంది తమ పాత పీఎఫ్ సొమ్మును వదిలేస్తుంటారు. ఈపీఎఫ్‌వో అంచనాల ప్రకారం.. ఈ కొత్త విధానం ద్వారా ప్రాథమికంగా దాదాపు ఒక లక్ష నిష్క్రియాత్మక ఖాతాలకు లబ్ధి చేకూరనుంది. వీటి ద్వారా దాదాపు రూ.5 కోట్ల మేర నిధులు నేరుగా అసలైన యజమానులకు చేరుతాయి. కాగితపు దరఖాస్తులు, క్లెయిమ్ ప్రక్రియల భారం లేకుండా ఈ సొమ్ము అందుతుండటం విశేషం.

రికార్డు స్థాయిలో క్లెయిమ్స్ వేగం.. 2.57 రోజుల్లోనే పూర్తి
సాంకేతిక సంస్కరణలు, CITES 2.01 నూతన ఐటీ కేంద్రీకృత వ్యవస్థ అమలులోకి రావడం వల్ల పీఎఫ్ క్లెయిమ్స్ పరిష్కార సమయం గణనీయంగా తగ్గిందని ఈపీఎఫ్వో వెల్లడించింది. అక్టోబర్ 2026 నాటికి పీఎఫ్ క్లెయిమ్స్ సగటు పరిష్కార సమయం 2.57 రోజులకు చేరింది. గతంలో వారాల తరబడి పట్టే ఈ ప్రక్రియ ఆటోమేషన్ వల్ల వేగవంతమైంది. ప్రస్తుతం ఈపీఎఫ్వో వద్ద దాదాపు రూ.32 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉంది. ఈ సంస్థ 8 కోట్లకు పైగా యాక్టివ్ చందాదారులకు, 85 లక్షల మంది పెన్షనర్లకు సేవలందిస్తోంది.

EPF Withdrawal: పీఎఫ్ విత్ డ్రాకు తాజా రూల్స్- కొత్తగా 3 విభాగాలు- ఎన్నిసార్లంటే.?
EPF Withdrawal: పీఎఫ్ విత్ డ్రాకు తాజా రూల్స్- కొత్తగా 3 విభాగాలు- ఎన్నిసార్లంటే.?

ఇప్పుడు వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు
సభ్యలకు సేవలను మరింత చేరువ చేసే దిశగా వాట్సాప్ ఆధారిత సేవలను కూడా ఈపీఎఫ్వో అందుబాటులోకి తెచ్చింది. సభ్యులు తమ నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్‌లో మెసేజ్ పంపి చివరి 5 లావాదేవీల వివరాలు, ఈ-పాస్‌బుక్ వివరాలను తెలుసుకోవచ్చు.

సభ్యులకు కీలక గమనిక:
మీ పాత పీఎఫ్ ఖాతాల్లోని సొమ్ము పొందాలనుకుంటే మీ యూఏఎన్‌కు ఆధార్ అనుసంధానమై ఉందో లేదో, అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా అప్డేట్ చేయబడ్డాయో లేదో ఒకసారి ఈపీఎఫ్వో పోర్టల్‌లో తనిఖీ చేసుకోవడం శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+