షాక్: ఎంసీఎల్ఆర్ రేట్ల పెంపు, గృహ, వాహనాల రుణాలు మరింత భారం

న్యూఢిల్లీ: బ్యాంకులు తమ కస్టమర్లకు షాకివ్వనున్నాయి. గృహ నిర్మాణాలతో పాటు, వాహనాల కొనుగోలు కోసం తీసుకొనేవారికి భారం తప్పకపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులు లెండింగ్ రేట్లను పెంచడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేట్ బ్యాంకులు గృహ, వాహనాల కొనుగోలు కోసం రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వనున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు రుణాల మంజూరులో కష్టమర్లను ఆకట్టుకొనేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి.

అయితే తాజాగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కీలకమైన లెండింగ్ రేట్లను పెంచాయి. దీంతో ప్రైవేట్ బ్యాంకుల నుండి రుణాలు తీసుకొనే వారిపై భారం తప్పకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 ప్రైవేట్ బ్యాంకుల నుండి రుణాలు మరింత భారం

ప్రైవేట్ బ్యాంకుల నుండి రుణాలు మరింత భారం

ప్రైవేట్ బ్యాంకులు లెండింగ్ రేట్లను పెంచాయి.దీంతో ప్రైవేట్ బ్యాంకుల నుండి రుణాలు తీసుకొనేవారిపై మరింత భారం పడే అవకాశాలున్నాయని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా గృహ నిర్మాణాల కోసం, వాహనాలు కొనుగోలు చేసుకొనే వారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.ఈ రుణాలు భారం కానున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచిన ప్రైవేట్ బ్యాంకులు

ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచిన ప్రైవేట్ బ్యాంకులు

ప్రైవేట్ బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేట్లను 5 నుండి పది బేసిక్ పాయింట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నాయి.. ఈ నిర్ణయంతో రుణాలు తీసుకొనే కష్టమర్లపై భారం పడనుందని ఆర్థిక వేత్తలు అనుమానిస్తున్నారు.యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్ర, ఇందస్‌ ఇండ్‌, ఎస్‌ బ్యాంకు తమ బెంచ్‌మార్క్‌ వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఇటీవలనే ప్రకటించిన విషయం తెలిసిందే.

 జనవరి నుండే కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు అమల్లోకి

జనవరి నుండే కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు అమల్లోకి

పెంచిన ఎంసీఎల్ఆర్ రేట్ల 2018 జనవరి నుండి అమల్లోకి వస్తాయని ఆయా బ్యాంకులు ప్రకటించాయి.2016 ఏప్రిల్ తర్వాత కొత్త ఎంసీఎల్ఆర్ ను అమల్లోకి తీసుకొచ్చింది అయితే దాని తర్వాత ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచడం ఇదే తొలిసారి .

డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు

డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు

డిపాజిట్లపై ఎక్కువ వడ్డీరేట్లు చెల్లిస్తున్న ఈ నేపథ్యంలో ఈ పెంపు తప్పలేదని పేర్కొన్నాయి. ఆర్‌బీఐ సంకేతాల మేరకు ఎంసీఎల్‌ఆర్‌ రేటు ఇంతకంటే కిందిగి దిగివచ్చే అవకాశం లేదని ప్రైవేట్ బ్యాంకుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+