వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు బ్యాంకులపై ఆర్బీఐ దిద్దుబాటు చర్యలు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: మొండి బకాయిలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొన్ని బ్యాంకులపై దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఇందులో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ ఇందులో ఉన్నాయి.
గత డిసెంబర్ నాటికి నికర మొండి బకాయిలు ఆరు శాతం దాటిపోవడంతో ఆయా బ్యాంకులపై ఆర్బీఐ తగిన దిద్దుబాటు చర్యలకు అవకాశం ఉందని ఒక నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా, దుస్తుల ఎగుమతులకు ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు మరో నివేదికలో ఇక్రా పేర్కొంది.

11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇలా నఫ్టాలే

11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇలా నఫ్టాలే

కొత్త పన్నుల విధానం, ఎగుమతులకు ప్రోత్సాహం, అంతర్జాతీయ పోటీ పరిస్థితుల వంటి అంశాలపై దుస్తుల పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది. గత మూడేళ్లలో 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నష్టాల్లో ఉన్న 11 బ్యాంకులు.. ఆర్బీఐ చేపట్టిన సర్దుబాటు చర్యల పరిధిలోకి రానున్నాయి.

11 బ్యాంకుల పరిధిలో రూ.21,900 కోట్ల రద్దు చేసే అవకాశం

11 బ్యాంకుల పరిధిలో రూ.21,900 కోట్ల రద్దు చేసే అవకాశం

నష్టాల భారీన పడ్డ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెనా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఉన్నాయి. 11 బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ. 21,900 కోట్లను కొద్ది రోజుల్లో రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అడిషనల్ టైర్ వన్ కేపిటల్ నిష్పత్తి పరిధిలోకి వచ్చే బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.603.85 బిలియన్లు అని ఇక్రా పేర్కొన్నది.

ఐఓబీపై రూ.2 కోట్ల ఫెనాల్టీ

ఐఓబీపై రూ.2 కోట్ల ఫెనాల్టీ

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రెండు దిగ్గజ బ్యాంకులకు భారీ షాక్‌ ఇచ్చింది. చట్టపరమైన నిబంధనలను పాటించని కారణంగా ప్రైవేట్ బ్యాంకు దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకుతోపాటు, ముఖ‍్య ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకునకు (ఐవోబీ) భారీ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను ఉల్లంఘించడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ)కి రూ. 2 కోట్ల పెనాల్టీ విధించింది.

 యాక్సిస్ బ్యాంక్‌పై రూ.3 కోట్ల జరిమానా

యాక్సిస్ బ్యాంక్‌పై రూ.3 కోట్ల జరిమానా

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) అంతర్గత తనిఖీ నివేదిక సహా పత్రాల పరిశీలన తర్వాత ఆర్బీఐ జారీచేసిన ఉత్తర్వులను ఉల్లఘించినట్టు తేలిందని ఆర్బీఐ పేర్కొంది. అలాగే మొండి బకాయిల అంచనాలకు సంబంధించిన యాక్సిస్‌ బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘిందని ఆర్బీఐ ప్రకటించింది. ఇందుకు యాక్సిస్ బ్యాంకుకు రూ. 3కోట్ల జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఖాతాల అనుసంధాన గడువు పెంచాలి: అసోచామ్‌

ఖాతాల అనుసంధాన గడువు పెంచాలి: అసోచామ్‌

బ్యాంకు ఖాతా‌లను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకునే గడువును పెంచాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో కుంభకోణం నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల్లో ఆందోళనలు పెరిగాయని.. వరుస బ్యాంక్‌ మోసాల నేపథ్యంలో మరోవైపు బ్యాంకు ఉద్యోగులపై కూడా తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్టుగా ఆసోచామ్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆధార్‌ గడువు ముగింపు పేరుతో వారిని మరింత ఆందోళనకు గురి చేయడం సరికాదని పేర్కొంది. ఆధార్‌ అనుసంధానగడువు తేదీని పెంచితే బాగుంటుందని అసోచామ్‌ అభిప్రాయపడింది.

English summary
Five public sector banks (PSBs), including Canara and Union Bank of India, are on the brink of being put under the Reserve Bank of India’s (RBI’s) prompt corrective action (PCA) plan. According to rating agency Icra, their net non-performing assets (NPAs) rose above 6 per cent in December 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X