బంపర్ ఆఫర్: రూపాయికే మొబైల్స్, ల్యాప్‌ట్యాప్: మే 13 నుండి ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్స్
న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ వేసవిలో మెగా సేల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు సిద్దమైంది. భారీ డిస్కౌంట్లను కస్టమర్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మే 13 నుండి మే 16 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ ను నిర్వహించనుంది.
సమ్మర్ బిగ్ సాపింగ్ డేస్ పేరుతో ఫ్లిప్ కార్డ్ ఈ మెగా సేల్స్‌ను నిర్వహించనుంది. సుమారు మూడు రోజుల పాటు ఈ బిగ్ షాపింగ్ డేస్ నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల్లో పలు వస్తువులపై అతి తక్కువ ధరకే విక్రయించనున్నారు.
కొన్ని వస్తువులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్దమైనట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు రోజుల్లో పెద్ద ఎత్తున మొబైల్స్ విక్రయాలు జరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మే 13 నుండి 16 వరకు బిగ్ షాపింగ్ డేస్
ఈ ఏడాది మే 13 నుండి 16వ తేది వరకు బిగ్ షాపిండ్ డేస్ సేల్స్ ను నిర్వహించాలని ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై సుమారు 80 శాతం డిస్కౌంట్ ద్వారా జోరుగా అమ్మకాలను జరపాలని ప్లిప్‌కార్ట్ భావిస్తోంది. కొన్ని రకాల కంపెనీల మొబైల్స్‌ను అతి తక్కువ ధరకే విక్రయించే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ కార్డులపై కొనుగోళ్ళకు ఆఫర్లు
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా కొనుగోలు చేసే వస్తువులకు భారీ ఆఫర్లను ప్రకటించనుంది క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో పాటు బైబ్యాక్ గ్యారంటీ ని అందించనుంది. కొన్ని వస్తువులపై ఎక్సెండెడ్ వారంటీని కూడ అందించనుంది.

రూపాయికే ల్యాప్ టాప్, మొబైల్స్
వంద శాతం క్యాష్‌బ్యాక్ పొందేలా ఫ్లిప్‌కార్ట్ ప్లాన్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ పొందేలా వినియోగదారులకు గేమ్స్ నిర్వహించనుంది. ఈ గేమ్‌లో విజయం సాధిస్తే కేవలం ఒక్క రూపాయికే ల్యాప్‌టాప్, మొబైల్స్ గెలుచుకొనే అవకాశం కల్పించనుంది.

తక్కువ ధరకే మొబైల్స్
మూడు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే బిగ్ షాపింగ్ డేస్‌లో కొత్త కొత్త మోడళ్ళను కూడ తక్కువ ధరకే విక్రయించనుంది ప్లిప్‌కార్ట్. బిగ్ షాపింగ్ డేస్ సందర్భంగా మొబైల్స్ విక్రయాలను ఆరు రెట్లను పెంచుకోవాలని ప్లిప్ కార్ట్ ప్లాన్ చేస్తోంది.












Click it and Unblock the Notifications