Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉల్లాసభరితంగా హాల్వా వేడుక.. విత్త మంత్రి జైట్లీకి స్వీట్ మెమొరీ మిగులుస్తుందా?

న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులోకి వచ్చాక తొలి, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ ఐదో బడ్జెట్‌ను వచ్చేనెల ఒకటో తేదీన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా బడ్జెట్ కసరత్తు, ప్రతిపాదనల రూపకల్పన, ముసాయిదా తయారీ, బిల్లు ముద్రణ తదితర అంశాలపై పలు సంప్రదాయాలు అమలులో ఉన్నాయి. ఆ సంప్రదాయాల్లో ముఖ్యమైంది హల్వా వేడుక. శనివారం 2018-19 సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ పత్రాల ప్రింటింగ్‌ ప్రారంభమైందన్న అంశానికి సంకేతంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆర్థికమంత్రిత్వశాఖ కార్యాలయంలోని నార్త్‌ బ్లాక్‌లో హాల్వా వేడుక నిర్వహించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఏటా బడ్జెట్‌ పత్రాలను ముద్రించే దానికి ముందు హల్వా వేడుక చేయడం ఆనవాయితీ.

హాల్వా వేడుక కార్యక్రమంలో దాదాపు ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన దాదాపు 100 మంది అధికారులు పాల్గొన్నారు. ఓ పెద్ద కడాయిలో హల్వాను వండి ఉద్యోగులందరికీ పంచి పెట్టారు. ఆర్థికశాఖ కార్యదర్శి హస్‌ముఖ్‌ అథియా, చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ అరవింద్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

 ఆర్థిక శాఖ సిబ్బంది, అధికారులు బిజీబిజీ ఇలా

ఆర్థిక శాఖ సిబ్బంది, అధికారులు బిజీబిజీ ఇలా

హాల్వా వేడుక తర్వాత అధికారులు, సిబ్బంది అంతా బడ్జెట్‌ పత్రాల ముద్రణలో బిజీబిజీగా ఉంటారు. అప్పటి వరకు అధికారులెవరూ ఇళ్లకు వెళ్లడం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం ఉండదు. అత్యంత సీనియర్‌ అధికారులు మాత్రమే ఇళ్లకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తారు. బడ్జెట్ పత్రాల్లో చేర్చిన అంశాలను బయటకు లీక్ అవ్వకుండా గోప్యత పాటించేందుకే అధికారులెవ్వరినీ, సిబ్బందినెవ్వరినీ ఇళ్లకు వెళ్లనివ్వకుండా ఉంచడం సంప్రదాయంగా వస్తున్నది. దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు, సిబ్బందికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

 బ్రిటన్ నుంచి సంప్రదాయంగా ఇలా బ్రీఫ్ కేసు

బ్రిటన్ నుంచి సంప్రదాయంగా ఇలా బ్రీఫ్ కేసు

బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించడానికి పార్లమెంట్‌కు వెళ్లే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. లెదర్ సూట్ కేసు చూపుతూ లోపలికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇది భారతీయుల్లో అత్యంత ఆసక్తి కలిగించే అంశం. బడ్జెట్ అంటే ఫ్రెంచ్ భాషలో ‘బౌగెట్టె' అంటే లెదర్ బ్యాగ్ అని అర్థం. బడ్జెట్ ప్రవేశపెట్టే నాడు లెదర్ బ్యాగ్‌తో ఆర్థిక మంత్రి రంగ ప్రవేశం చేయడం బ్రిటిష్ పాలకుల నుంచి సంప్రదాయంగా వచ్చిందే. బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ఒక బ్రీఫ్ కేసును ఇతరులకు పాస్ చేస్తారు. బడ్జెట్ బ్రీఫ్ కేస్ ఏడాదికో రకంగా, రంగులో దర్శనమిస్తూ ఉంటుంది.

 సంప్రదాయాన్నితిరగరాసిన యశ్వంత్ సిన్హా

సంప్రదాయాన్నితిరగరాసిన యశ్వంత్ సిన్హా

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి వచ్చిన సంప్రదాయాన్ని యశ్వంత్ సిన్హా తిరగ రాశారు. అంతకుముందు 1947 నుంచి 1999 వరకు ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. బ్రిటిష్ వలస పాలనలో భారతదేశంలో బ్రిటిష్ సివిల్ సర్వంట్ సర్ బాసిల్ బ్లాక్కెట్ ఐదు గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1999 వరకు ఇదే సంప్రదాయం కొనసాగింది. 1999లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యశ్వంత్ సిన్హా... బ్రిటిష్ వలస పాలన నాటి సంప్రదాయాన్ని తిరుగరాసి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ముహూర్తం ఖరారు చేశారు. ఇక బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించే విధాన నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+