వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ నష్ట నివారణ: హస్తినలో బ్యాంక్ ఆస్తుల విక్రయానికి నిర్ణయం?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రానికి చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సారథ్యంలో రూ.11,400 కోట్ల మేరకు మోసపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన ఆస్తులను విక్రయించి మరీ నష్టాలను పూడ్చుకునే విషయాన్ని ఆలోచిస్తున్నది. దేశ చరిత్రలో రికార్డు స్రుష్టించిన కుంభకోణం బ్యాంకింగ్‌ వ్యవస్థను కుదిపేసింది. దేశ రాజధాని నగరం 'హస్తిన'లో బ్యాంకుకు గల ఆఫీసు స్థలాన్ని విక్రయించాలని తలపెట్టింది.
ఈ భవనం విలువ రమారమీ రూ.5000 కోట్లు ఉంటుందని బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని బ్యాంక్ అధికారులు తలపోస్తున్నట్లు సమాచారం.

 పీఎన్బీకి స్టాక్ మార్కెట్‌లో రూ.8000 కోట్ల నష్టం

పీఎన్బీకి స్టాక్ మార్కెట్‌లో రూ.8000 కోట్ల నష్టం

బ్యాంకు తన ఆస్తులను కూడా టెండర్ల ప్రక్రియ ద్వారా విక్రయించి ఆదాయం సముపార్జించాలని పేరు చెప్పడానికి ఇష్ట పడని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. ఆసక్తిగల పార్టీలతో ఇప్పటికే తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మోర్గాన్ స్టాన్లీ అనే ఆర్థిక రంగ సేవల సంస్థ మోసానికి తోడు స్టాక్ మార్కెట్‌లో పీఎన్బీ షేర్ 14 శాతానికి పైగా పతనం కావడంతో అదనంగా రూ.8000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కోల్పోయిందని నిర్ధారించింది.

Recommended Video

PNB Fraud : Nirav Modi, $ 1.6 Billion Fraud : CBI Alerts Interpol
 బ్యాంకింగ్ వ్యవస్థలో నాలుగు రకాల ఆడిటింగ్ ఇలా

బ్యాంకింగ్ వ్యవస్థలో నాలుగు రకాల ఆడిటింగ్ ఇలా

ఆర్థిక సేవల ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన బ్యాంకింగ్ ఫ్రాడ్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసం ఒక వ్యవస్థాగత లోపం అని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నీరవ్ మోదీ వంటి వారు చేసిన మోసాలను కేవలం బ్యాంక్ అంతర్గత ఆడిటర్లు గానీ, అంతర్గత ప్లస్ బహిర్గత ఆడిటర్లు గానీ తేల్చగలరని, ఆర్బీఐ చేయగలిగిందేమీ లేదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో నాలుగు రకాల ఆడిట్లు ఉన్నాయి. అందులో మొదటిది బ్యాంక్ బ్యాలెన్ షీట్లు. రెండవది బ్యాంక్ సిబ్బంది తనిఖీ. మూడవది అంతర్గత, బహిర్గత ఆడిట్. చివరిగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీ ఉంటుంది.

బ్యాంక్ మేనేజ్మెంట్ సునిశిత పరిశీలనతోనే ‘స్విఫ్ట్' మెసేజ్‌లు

బ్యాంక్ మేనేజ్మెంట్ సునిశిత పరిశీలనతోనే ‘స్విఫ్ట్' మెసేజ్‌లు

మోసం జరిగిన పీఎన్బీ ముంబై శాఖలో బ్యాంకు అధికారుల అనుమతి లేకుండా సిబ్బంది ఎటువంటి అవకతవకలు జరుగడానికి అవకాశం లేదని చెబుతున్నారు. నీరవ్ మోదీ కంపెనీలకు ‘ఎల్వోయూ' పేరిట ఇతర బ్యాంకుల నుంచి రుణ పరపతి పొందే పత్రాల జారీ ప్రక్రియ సంబంధిత బ్యాంకు అధికారులకు తెలిసే జరిగి ఉంటుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రాథమికంగా ఇతర బ్యాంకుల్లో నీరవ్ మోదీ కంపెనీలకు ఇచ్చే రుణాలకు పీఎన్బీ.. ఇచ్చే ఎల్వోయూలే ఆధారం. ఆ రుణాలన్నింటికీ పీఎన్బీ హామీ ఇస్తుంది. ‘స్విఫ్ట్' మెసేజింగ్ వ్యవస్థ ద్వారా ఎల్వోయూ మెసేజ్‌లు పంపితేనే రుణ హామీ అమలులోకి వస్తుంది. స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్సియల్ టెలీ కమ్యూనికేషన్) లావాదేవీలు బ్యాంక్ కోర్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. బ్యాంక్ మేనేజ్మెంట్ పరిశీలించడం ద్వారా రోజు వారీ ‘స్విఫ్ట్' లావాదేవీలు జరుగుతాయి.

 వ్యవస్థ లోపాలను ఆర్బీఐ సరిదిద్దాలంటున్న నిపుణులు

వ్యవస్థ లోపాలను ఆర్బీఐ సరిదిద్దాలంటున్న నిపుణులు

స్టాక్ హోల్డర్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ (ఎస్ఈఎస్) మేనేజింగ్ డైరెక్టర్ జేఎన్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ సామూహికంగా మోసం జరుగుతున్నా ఎవరూ కనిపెట్టలేదంటే అది ప్రతి ఒక్కరిదీ తప్పవుతుందన్నారు. నంగియా అండ్ కో అనే కన్సల్టెంట్ సంస్థ వ్యవస్థాపకుడు రాకేశ్ నంగియా మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాల వైఫల్యం అని చెప్పారు. తాజా పరిస్థితులకు అనుగుణంగా సరైన నియంత్రణ విధానం అమలులోకి తేవాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. బ్యాంకుల బ్యాలెన్ షీట్ల పరిశీలన దశలో తేల్చాలని మరొక చార్టర్డ్ అక్కౌంటెంట్ అభిప్రాయ పడ్డారు. ఎల్వోయూలను బ్యాంక్ పుస్తకాల్లో చేర్చకపోతే ఆడిటింగ్ నాణ్యత దెబ్బ తింటుందని మరో చార్టర్డ్ అక్కౌంటెంట్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టింగ్ సంస్థ అలియా కన్సల్టింగ్ సీఈఓ దీపక్ భావ్నానీ మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను సరిదిద్దే దిశగా ఆర్బీఐ చర్యలు చేపట్టాలని, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

English summary
New Delhi: Punjab National Bank, which is embroiled in a Rs11,400 crore fraud, is considering monetizing its real estate assets, including a giant office space in New Delhi worth an estimated Rs5,000 crore, a bank official with direct knowledge of the matter told News agency.New Delhi: Punjab National Bank, which is embroiled in a Rs11,400 crore fraud, is considering monetizing its real estate assets, including a giant office space in New Delhi worth an estimated Rs5,000 crore, a bank official with direct knowledge of the matter told News agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X