దేశ చరిత్రలో 67 టన్నుల బంగారం విమానమెక్కిన వేళ!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముప్పై ఐదేళ్ల క్రితం.. 1991 గల్ఫ్ యుద్ధం ముసురుకున్న వేళ, భారతదేశం వద్ద విదేశీ మారక నిల్వలు అట్టడుగుకు పడిపోయాయి. కేవలం రెండు వారాల దిగుమతులకు కూడా సరిపోని పరిస్థితి. చేసేది లేక, అప్పటి ప్రభుత్వం 67 టన్నుల బంగారాన్ని అత్యంత రహస్యంగా విదేశాలకు 'ఎయిర్‌లిఫ్ట్' చేసి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అది దేశం ఎదుర్కొన్న అత్యంత గడ్డు కాలం. కానీ, నేడు మళ్ళీ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో.. భారతదేశం ఆత్మవిశ్వాసంతో, దృఢంగా నిలబడటం గమనార్హం.

1991 మే నెలలో ముంబై వీధుల గుండా భారీ భద్రత మధ్య ఆర్బీఐకి చెందిన 47 టన్నుల బంగారం విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి లండన్‌కు, ఆ తర్వాత మరో 20 టన్నులు స్విట్జర్లాండ్‌కు తరలించారు. ఈ విక్రయం వెనుక ఉన్న ప్రధాన కారణం 'చమురు సెగ'. అప్పట్లో బ్యారెల్ ధర ఒక్కసారిగా 170 శాతం పెరగడంతో భారత్ ఆర్థికంగా కుప్పకూలిపోయింది. లైసెన్స్ రాజ్, మూసివేసిన ఆర్థిక వ్యవస్థ వల్ల అప్పట్లో విదేశీ సాయం కోసం ఐఎంఎఫ్ వద్దకు వెళ్లడం మినహా మరో దారి లేదు. ఈ సంక్షోభమే చివరకు నరసింహారావు - మన్మోహన్ సింగ్‌ల ఆధ్వర్యంలో 'ఆర్థిక సంస్కరణల'కు బీజం వేసింది.

From Gold Airlift to 700B Dollars Reserves How India Transformed Its Economy Between 1991 and 2026 Gulf Crisis

2026: రక్షణ కవచంలా 700 బిలియన్ డాలర్ల నిల్వలు!

కట్ చేస్తే.. 2026లో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్‌పై దాడులు, హార్ముజ్ జలసంధిలో అంతరాయాల వల్ల క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ 100 డాలర్ల మార్కును దాటింది. రూపాయి విలువ కూడా కనిష్ట స్థాయిలకు పడిపోయింది. కానీ, 1991 నాటి భయం ఇప్పుడు లేదు. ఎందుకంటే, అప్పట్లో మన దగ్గర కేవలం 1.2 బిలియన్ డాలర్లు ఉంటే, నేడు ఆర్బీఐ వద్ద ఏకంగా 700.95 బిలియన్ డాలర్ల భారీ నిల్వలు ఉన్నాయి. ఇది దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతుంది. ఏవైనా షాక్‌లు తగిలినా రూపాయిని నిలబెట్టేందుకు ఈ 'డాలర్ల బఫర్' ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది.

వ్యూహాత్మక నిల్వలు.. మారిపోయిన వ్యూహం

1991లో చమురు కొనేందుకు డబ్బులు లేని స్థితి నుంచి, నేడు చమురును నిల్వ చేసుకునే స్థాయికి మనం ఎదిగాం. విశాఖపట్నం, మంగళూరు, పాదూరు వంటి చోట్ల ఏర్పాటు చేసిన 'వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు' (SPR) ద్వారా దేశానికి అవసరమైనప్పుడు 70 రోజులకు పైగా చమురును అందించే సామర్థ్యం మనకు ఉంది. అంతేకాకుండా, కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడకుండా రష్యా, మొరాకో వంటి 40 దేశాల నుంచి దిగుమతులను వైవిధ్యపరిచాం. సముద్ర మార్గాలను కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపు మళ్లించడం ద్వారా రిస్క్ తగ్గించుకున్నాం.

కొత్త సవాళ్లు.. ఎదురుదాడికి సిద్ధం!

భారత ఆర్థిక వ్యవస్థ ఆరవ అతిపెద్ద వ్యవస్థగా ఎదిగినా, కొన్ని బలహీనతలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మనం ఇప్పటికీ 88-89 శాతం చమురును దిగుమతులే చేసుకుంటున్నాం. బ్యారెల్ ధరలో ఒక్క డాలర్ పెరిగినా మన జేబుకు రూ.13 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. దీనికి తోడు గల్ఫ్ నుంచి వచ్చే 'రెమిటెన్స్‌లు' (వలస కార్మికుల సంపాదన) కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం 'ఇథనాల్ బ్లెండింగ్', 'గ్రీన్ హైడ్రోజన్' వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

1991 సంక్షోభం మనల్ని చర్యలు తీసుకోవాలని 'బలవంతం' చేసింది. కానీ, 2026లో మనం ఆ ఒత్తిడికి తలవంచకుండా 'వ్యూహాత్మక ప్రణాళిక'తో ముందుకు వెళ్తున్నాం. ముప్పై ఆరేళ్ల కిందట విమానమెక్కిన బంగారం.. నేడు విదేశీ నిల్వలుగా, ఎగుమతులుగా, ఐటీ సేవలుగా డాలర్ల రూపంలో మళ్లీ స్వదేశానికి చేరడమే భారత ప్రగతికి నిదర్శనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+