Success Story: అప్పుతో మొదలైన అసాధారణ ప్రస్థానం! తెలుగోడి సైకిల్ విప్లవం

ఒక చేతిలో శూన్యం.. మరో చేతిలో కొండంత సంకల్పం! చేతిలో సరిపడా పెట్టుబడి లేకపోయినా, పట్టుదలే పెట్టుబడిగా మారితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన అరుదైన పారిశ్రామికవేత్త ఆయన. చేనేత కుటుంబం నుంచి వచ్చి, చిరు వ్యాపారంతో మొదలై, నేడు అంతర్జాతీయంగా సైక్లింగ్ విప్లవానికి రూపశిల్పిగా మారిన 'డీవీ మనోహర్' ప్రస్థానం ఒక వ్యక్తి విజయగాథ కాదు.. భారతదేశపు స్మార్ట్ మొబిలిటీ చరిత్రలో రచింపబడిన ఒక అద్భుత అధ్యాయం.

1975 నాటి రోజులు.. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగంలో స్థిరపడాలనుకోలేదు మనోహర్. స్వయం ఉపాధి సాధించాలనే బలమైన ఆకాంక్షతో, ప్రభుత్వం అందించే స్వయం ఉపాధి పథకం కింద రూ.62 వేల రుణం, తల్లిదండ్రుల నుంచి పొందిన మరో రూ.10 వేల ఆర్థిక సాయంతో ఒక చిన్న కుటీర పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. 'డీప్ వెల్ హ్యాండ్ పంపుల' తయారీతో మొదలైన ఆ ప్రయాణం, క్రమంగా విస్తరించింది.

తరువాత ప్రైవేట్ ఎల్పీజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ 'శక్తి గ్యాస్' సంస్థను స్థాపించి, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ గ్యాస్ సరఫరాదారులలో ఒకటిగా నిలబెట్టారు. అంతటితో ఆగకుండా హాస్పిటాలిటీ రంగంలోకి ప్రవేశించి, లగ్జరీ హోటళ్లను నిర్మించి వ్యాపార దిగ్గజంగా అవతరించారు.

From Micro Industry to National Cycling Policy The Inspiring Success Story of Entrepreneur DV Manoha

ఆరోగ్య సవాలు నుంచి.. 'లండన్-పారిస్' సైక్లింగ్ సవాలు వరకు!

వ్యాపార శిఖరాలను అధిరోహించినా, 55 ఏళ్ల వయస్సులో మనోహర్‌ను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. వైద్యులు పని ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించినా, ఖాళీగా ఉండటం ఇష్టం లేక సైక్లింగ్ వైపు మొగ్గు చూపారు. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సైకిల్ ఎక్కిన తొలిరోజే కిందపడినా, మనోహర్ తన పట్టుదలను వదల్లేదు.

అంతర్జాతీయంగా అత్యంత కఠినమైనదిగా భావించే 'లండన్ - పారిస్' సైక్లింగ్ ట్రాక్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాపార ఒత్తిడిలోనే రోజూ ఉదయం 4 గంటలకే లేచి, క్రమం తప్పకుండా 9 నెలల పాటు కఠిన సాధన చేశారు. భార్య, పిల్లల సహకారంతో రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ, ఆ అంతర్జాతీయ సవాలును విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

Honda Success Story: 1937లో టొయోటా కొట్టిన దెబ్బ.. 2026లో గ్లోబల్ ఎంపైర్!
Honda Success Story: 1937లో టొయోటా కొట్టిన దెబ్బ.. 2026లో గ్లోబల్ ఎంపైర్!

వరల్డ్ సైక్లింగ్ అలయన్స్‌లో ఆసియాకే గర్వకారణం

60 ఏళ్ల వయస్సులోనూ వర్షాలు, తుఫాన్లను సైతం తట్టుకుని సైక్లింగ్ సవాళ్లను అధిగమించిన ఆయనకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ 'వరల్డ్ సైక్లింగ్ అలయన్స్' (WCA) బోర్డులో సభ్యునిగా ఆసియా ఖండం నుంచే ఎంపికైన తొలి వ్యక్తిగా డీవీ మనోహర్ చరిత్ర సృష్టించారు. తదనంతరం అదే సంస్థకు ఉపాధ్యక్షుడిగా, ట్రెజరర్‌గా పదవులు చేపట్టి, అంతర్జాతీయ సైక్లింగ్ వ్యవస్థపై తనదైన ముద్ర వేశారు.

'స్మార్ట్‌బైక్' విప్లవం: దేశానికి పబ్లిక్ బైక్ షేరింగ్ పరిచయం

ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్ ప్రాధాన్యతను పరిశీలించిన మనోహర్, భారతదేశంలో పెరుగుతున్న వాహన కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగానే 'స్మార్ట్‌బైక్', పబ్లిక్ బైక్ షేరింగ్ (PBS) ఆలోచన పురుడుపోసుకుంది. మొదట్లో బ్యాంకులు, పెట్టుబడిదారులు ముందుకు రాకపోయినా, రూ.3 కోట్ల సొంత నిధులతో ప్రత్యేక డిజిటల్ యాప్‌ను డెవలప్ చేసి, ఢిల్లీ, చెన్నై, చండీగఢ్, హైదరాబాద్ వంటి నగరాల్లో స్మార్ట్‌బైక్ సేవలను ప్రారంభించారు.

వారణాసి నుంచి విశాఖపట్నం వరకు, భారత నావికాదళం, మిలిటరీ డిఫెన్స్ విభాగాలు, విద్యాసంస్థల్లో సుమారు 10,000కు పైగా స్మార్ట్‌బైక్‌లు సేవలు అందిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ బైక్ షేరింగ్ ప్రాజెక్టుగా నిలిచిన చండీగఢ్ ప్రాజెక్ట్‌కు గాను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన జాతీయ అవార్డును అందుకోవడం విశేషం.

Success Story: పదో తరగతే చదువు.. ఏడాదికి 5 కోట్ల సంపాదన: ఈ రైతు సక్సెస్ సీక్రెట్ ఇదే!
Success Story: పదో తరగతే చదువు.. ఏడాదికి 5 కోట్ల సంపాదన: ఈ రైతు సక్సెస్ సీక్రెట్ ఇదే!

ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చిన 'జాతీయ సైక్లింగ్ విధానం'

స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగమైన మనోహర్, తన తనయుడు ధర్మిన్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీకి 'నేషనల్ సైక్లింగ్ పాలసీ' ముసాయిదాను వివరించారు. దేశంలో 2030 నాటికి తక్కువ దూర ప్రయాణాల్లో సైక్లింగ్ వాటాను 25 శాతానికి పెంచడం, ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణం, షాపింగ్ మాల్స్ మరియు ఆఫీసుల్లో ప్రత్యేక సైకిల్ పార్కింగ్, పాఠశాలల నుంచి క్రెడిట్ పాయింట్లు ఇవ్వడం వంటి విప్లవాత్మక అంశాలను ఈ విధానంలో పొందుపరిచారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విజ్ఞప్తి మేరకు ఆయనే స్వయంగా ఈ జాతీయ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు సమర్పించారు.

వాయు కాలుష్యంపై పోరాటం: జీవిత మిషన్!

"కోవిడ్ సమయంలో రెండేళ్లలో 5 లక్షల మంది చనిపోతే ప్రపంచం మొత్తం భయపడింది. కానీ, వాయు కాలుష్యం వల్ల ప్రతి ఏటా దేశంలో 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు" అని గుర్తుచేసే మనోహర్, కాలుష్య రహిత భారత్‌ను సాకారం చేయడమే తన జీవిత ప్రధాన ధ్యేయంగా ఎంచుకున్నారు. నాటి సాధారణ చేనేత కుటుంబ మూలాలను ఏనాడూ మరువని ఆయన, సంపద సృష్టించడం కంటే సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన విజయమని నమ్ముతారు.

'వేణురావు ఫౌండేషన్' ద్వారా కోవిడ్ సంక్షోభంలో పేదలకు నిత్యావసరాలు అందించడమే కాక, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 'పీడియాట్రిక్ ఐసీయూ' లు ఏర్పాటు చేశారు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల కోసం మొబైల్ ఐ క్లినిక్ బస్సులు, ఆపరేషన్ థియేటర్లను నిర్మించి వేలాది మందికి ఉచిత దృష్టిని ప్రసాదిస్తున్నారు. శూన్యం నుంచి మొదలై సాధించిన ఈ పారిశ్రామిక, సామాజిక విజయం రాబోయే తరాలకు నిరంతర స్ఫూర్తిదాత!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+