బంగారం ధరల్లో బిగ్ ఫాల్: రెండో రోజూ: పసిడి కళకళ

దేశంలో బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న పరిణామాలు, అమెరికా డాలర్ విలువలో మార్పులు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల ప్రభావం దేశీయంగా బంగారం, వెండి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 0.33 శాతం తగ్గుదల కనిపించింది. వెండి ధర 0.52 శాతం వరకు తగ్గింది. ఈ వారంలో పైగా పండగ సీజన్ లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టయింది.

నవంబర్ 5 నాటి గడువు గల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,780 వద్ద ట్రేడ్ కాగా, డిసెంబర్ 4 గడువు కలిగిన వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కిలోకు రూ. 2,26,410 వద్ద కొనసాగాయి. మంగళవారం నాటి నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 650, 22 క్యారెట్లు రూ. 600, 18 క్యారెట్లు రూ. 490 మేర తగ్గింది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బులియన్ మార్కెట్లో దారి తీస్తోన్నాయి.

gold-and-silver-prices-came-down-again-in-india-at-mcx-as-rebounding-24k-22k-and-18k-remain

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,760 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్లు రూ.1,37,280 పలకింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,5800 కాగా, 22 క్యారెట్లు రూ.1,37,115 వద్ద నిలిచింది. చెన్నైలో ఇవే ధరలు వరుసగా రూ. 1,49,960, రూ.1,37,463, వద్ద కొనసాగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,700, 22 క్యారెట్లు రూ.1,37,225 వద్ద స్థిరపడింది.

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,957, 22 క్యారెట్లు - రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,265

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+