పసిడి రేట్లు బ్యాక్ టు ఫామ్

దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా బంగారం రేట్లు పుంజుకున్నాయి. ఇది స్వల్పమే అయినప్పటికీ.. ఇదే పరిస్థితి వచ్చేవారం కూడా కొనసాగుతుందనే అంచనాలకు బాటలు వేసింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాముల ధర రూ.1,47,660 వద్ద నమోదు కాగా, సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,35,350లకు చేరుకుంది.

10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలో రూ. 220 మేర పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు రూ. 200, 18 క్యారెట్లు రూ. 160 మేర పెరిగాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కూడా పసిడి, వెండి కాంట్రాక్టులు లాభాల్లో నడిచాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 0.10 శాతం మేర పెరిగింది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ 0.35 శాతం లాభంతో కిలోకు రూ. 2,12,370 వద్ద కొనసాగింది. అంతర్జాతీయంగా అమెరికా సైనిక వ్యూహాలు, ఇరాన్ ప్రతిఘటన హెచ్చరికలు గ్లోబల్ మార్కెట్లలో భయాందోళనలను పెంచాయి.

Gold and Silver prices in India edged High marginally 24K 22K and 18K compared previous session

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,660 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,35,350 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,690, 22 క్యారెట్లు రూ. 1,35,610 గా నమోదైంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,660 వద్ద కాగా 22 క్యారెట్లు రూ. 1,35,35 వద్ద రికార్డయింది. చెన్నైలో ఇవే రేట్లు రూ. 1,47,710, రూ. 1,35,990 వద్ద నమోదయ్యాయి.

ఏపీ మీదుగా చర్లపల్లి నుంచి తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా చర్లపల్లి నుంచి తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,125

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+