ఏపీ మీదుగా చర్లపల్లి నుంచి తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు

దసరా పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

దాన్ని కొనసాగిస్తూ తాజాగా మరో దూర ప్రాంతం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది దక్షిణ మధ్య రైల్వే. చర్లపల్లి- నాగర్ కోయిల్ మధ్య ఈ రెండు వీక్లీ ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. మొదటి రైలు ఈ నెల 30వ తేదీన పట్టాలెక్కనుంది. నవంబర్ 15వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ, ఏపీ నుంచి చెన్నై, మధురై వంటి నగరాలకు వెళ్లాలనుకునే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడతాయి.

SC Railway to run Special Trains From Charlapalli to Nagercoil to clear Festive Extra rush of Passengers

ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 7:45 నిమిషాలకు చర్లపల్లి నుండి బయలుదేరే నంబర్ 07535 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 10:45 నిమిషాల నాగర్ కోయిల్ కు చేరుకుంటుంది.

భారత్ కు బిగ్ రిలీఫ్- మాఫీ: విచక్షణాధికారాలను ఉపయోగించిన డొనాల్డ్ ట్రంప్
భారత్ కు బిగ్ రిలీఫ్- మాఫీ: విచక్షణాధికారాలను ఉపయోగించిన డొనాల్డ్ ట్రంప్

తిరుగు ప్రయాణంలో.. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:45 నిమిషాలకు నాగర్ కోయిల్ నుంచి బయలుదేరే నంబర్ 07536 ప్రత్యేక రైలు రెండో రోజు వేకువ జామున 3:45 నిమిషాలకు చర్లపల్లి కు చేరుకుంటుంది.

విజయవాడ, గుంటూరు వైసీపీ మేయర్ అభ్యర్థులు వీళ్లే: సెకెండ్ లిస్ట్ లో.. !!
విజయవాడ, గుంటూరు వైసీపీ మేయర్ అభ్యర్థులు వీళ్లే: సెకెండ్ లిస్ట్ లో.. !!

నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మూర్, తాంబరం, చెంగల్ పట్టు, విల్లుపురం, విరుధాచలం, తిరుచిరాపల్లి, డిండిగల్, మధురై, విరుధునగర్, సత్తూర్, కోవిల్ పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+