మే నెల తర్వాత తొలిసారి భగ్గుమన్న ధరలు.. క్రూడాయిల్ కొత్త రికార్డు

ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ మండిపోతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ ముడిచమురు ధర మే నెల తర్వాత తొలిసారిగా బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును తాకింది. మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధం, రష్యా నుంచి ఇంధన సరఫరాలో తలెత్తిన తీవ్ర అడ్డంకులే ఈ భారీ ధరాభారానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపించడంతో అంతర్జాతీయంగా వ్యాపారులు భారీగా ముడిచమురు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఒక్కరోజులోనే ధరలు ఏకంగా 3.7 శాతం మేర పైకి ఎగబాకాయి.

యుద్ధ భయాలు.. నిలిచిపోయిన చమురు సరఫరా

ఇంధన మార్కెట్లో ఈ అస్థిరతకు ప్రధాన కారణం చమురు ఉత్పత్తి కేంద్రాలు, రవాణా మార్గాల్లో జరుగుతున్న దాడులే. ఒకవైపు సౌదీ అరేబియాపై ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడులు కొనసాగిస్తుండగా.. మరోవైపు రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం ఒకరి శక్తి వనరుల వ్యవస్థలపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఇటీవలే రష్యాలోని రియాజాన్ ఆయిల్ రిఫైనరీపై జరిగిన దాడితో అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ కారణాల వల్ల ఈ ఏడాదిలోనే ముడిచమురు ధరలు ఏకంగా 70 శాతానికి పైగా పెరిగాయి. యూరప్‌లో డీజిల్ ధరలైతే ఏకంగా రెట్టింపు స్థాయికి చేరడం కలకలం రేపుతోంది.

Global Oil Prices Surge Brent Crude Reaches 110 as Geopolitical Tensions and Supply Shortages Grow

ట్రంప్ డీజిల్‌ డీల్‌కు యూఎస్ కాంగ్రెస్ బ్రేక్

క్రూడాయిల్ సంక్షోభం నుంచి ఊరట పొందేందుకు రష్యా నుంచి కొన్ని మిలియన్ల బారెళ్ల డీజిల్‌ను సేకరించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యత్నించారు. అయితే ఈ ఒప్పందానికి అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్) గండికొట్టింది. రష్యాతో డీజిల్ ఒప్పందాన్ని అడ్డుకునేలా శుక్రవారం యూఎస్ ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. రష్యాకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చే ఏ ప్రతిపాదననూ అంగీకరించబోమని సభ్యులు స్పష్టం చేశారు. ఒకవేళ రష్యా డీజిల్ ప్రపంచ మార్కెట్లలోకి రాకపోతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర రిఫైనరీలు తమ ఉత్పత్తిని విపరీతంగా పెంచాల్సి వస్తుంది, ఇది క్రూడాయిల్ డిమాండ్‌ను మరింత పెంచుతుంది.

మిడిల్ ఈస్ట్‌లో పెరిగిన ఉద్రిక్తతలు.. మళ్లీ యుద్ధ మేఘాలు

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' (జీబీయూ-43/బీ) ఉపయోగించే అవకాశాన్ని అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపారేయలేదు. అమెరికా ఇప్పటికే దీనికి సంబంధించిన వ్యూహాత్మక దాడుల ప్రణాళికలను సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చే అవకాశం 65 శాతానికి పెరిగిందని ప్రముఖ విశ్లేషణ సంస్థ యురేషియా గ్రూప్ పేర్కొంది. ఈ యుద్ధ భయాల నేపథ్యంలో చమురు ధరలు రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+