జనసేనకు సీట్ల కేటాయింపు పై మహిళా మంత్రి కన్నీటి పర్యంతం..!!

స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు (ఆదివారం) నామినేషన్ల కు చివరి రోజు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లో భాగంగా అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. అటు వైసీపీ సైతం తమ అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపు టీడీపీ - జనసేన కేడర్ లో కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది. జనసేనకు సీటు కేటాయింపు పై ఏకంగా మంత్రి కన్నీరు పెట్టుకోవటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

మున్సిపల్ ఎన్నికల కోసం కూటమి సీట్ల మధ్య ఒప్పందాల మేరకు అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పుడు కేడర్ లో కొత్త లెక్కలకు కారణమవుతోంది. అందులో భాగంగా విజయనగరం కార్పోరేషన్ మేయర్ సీటు టీడీపీకి కేటాయించగా.. సాలూరు మున్సిపాల్టీ పొత్తులో భాగంగా జనసేనకు దక్కింది. సాలూరు మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించడం పట్ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు శాతం కూడా లేని జనసేన పార్టీకి మున్సిపల్ ఛైర్మన్ సీటు కేటాయించడం దారుణమంటూ కన్నీరు పెట్టుకోవటంతో సహచర మంత్రులు బెజ్జగించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నవే మూడు మున్సిపాలిటీలు. అందులో రెండు తీసుకెళ్ళి జనసేనకు కేటాయిస్తే ఎలా అని మంత్రి సంధ్య రాణి ఆవేదన వ్యక్తం చేసారు. ఇది పొత్తా అని సూటిగానే నిలదీశారు. అలాగే న్యాయమా ధర్మమా అని ప్రశ్నించారు.

చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కు సీటు ఖరారులో బిగ్ ట్విస్ట్..!!
చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కు సీటు ఖరారులో బిగ్ ట్విస్ట్..!!
minister-sandhya-rani-breaks-down-over-salur-municipal-chairman-post-allocation-to-jana-sena

స్థానిక ఎన్నికల వేళ కొత్త పరిణామాలు

ఒక్కసారి అధినాయకత్వం ఆలోచించాలని కూడా ఆమె పార్టీ పెద్దలను కోరారు. కార్యకర్తలకు తాను ఏ విధంగానూ సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అని ఆమె ఒక దశలో పూర్తిగా ఎమోషనల్ అయ్యరు అంతే కాదు కన్నీటి పర్యంతం అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో సాలూరు, పాలకొండలను పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారు. కేవలం పార్వతీపురం మాత్రమే టీడీపీకి దక్కింది. ఈ కేటాయింపుల పైన గుమ్మడి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం సాలూరులో టీడీపీకి మునిసిపాలిటీ లేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. కూటమిలో జరిగిన సీట్ల ఒప్పందాల పైన ఏకంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్టీ అంతర్గత సమావేశంలో కన్నీరు పెట్టుకుంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+