క్షీణించిన డాలర్ విలువ: భారీగా పెరిగిన బంగారం ధర

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బంగారం ధరలు పెరిగాయి. డాలర్ బలహీనపడడంతో బంగారం ధరలు పెరిగాయి. 2010 తర్వాత ఇంత బంగారం ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయంగా చోటు చేసుకొంటున్న మార్పుల ప్రభావం బంగారం ధరలపై కన్పిస్తోంది. డాలర్ బలహీనపడుతుండడం బంగారం ధరలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.

2010 తర్వాత ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగడానికి డాలర్ మారకం విలువ సూచి 9 శాతం కంటే కిందకు దిగజారడమే కారణమనే అభిప్రాయం కూడ లేకపోలేదు. అయితే ఈ పరిణామలన్నీ కూడ బంగారం ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి

 డాలర్ విలువ క్షీణించి బంగారం ధరల పెరుగుదల

డాలర్ విలువ క్షీణించి బంగారం ధరల పెరుగుదల

12 నెలలుగా డాలర్‌ విలువ తగ్గుతుండడంతో బంగారం ధర పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడ బంగారం ధరలపై చూపుతోంది.అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్29వ, తేది నాటికి ఔన్సు బంగారం ధర 0.1 శాతం పెరిగి 1,295.45డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది నవంబరు 29న ఔన్సు బంగారం ధర 1,296.26 డాలర్లుగా ఉంది.

 అమెరికా మార్కెట్లో నిలకడగా బంగారం ధర

అమెరికా మార్కెట్లో నిలకడగా బంగారం ధర

ప్రస్తుతం అమెరికా మార్కెట్లో ఔన్సు బంగారం 1,297.50 డాలర్ల వద్ద ఉంది.. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడానికి డాలర్‌ మారకం విలువ రోజురోజుకు క్షీణించడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం విలువ ఈ వారంలో ఇప్పటివరకూ 1.7 శాతం పెరిగింది.

 బంగారం ధర 12 శాతం పెరుగుదల

బంగారం ధర 12 శాతం పెరుగుదల

గత మూడు వారాలుగా పెరిగిన బంగారం ధర ఈ ఏడాది మొత్తంలో పెరిగిన దానికన్నా 12శాతం ఎక్కువ. మరోవైపు డాలర్‌ మారకం విలువ సూచీ 9శాతం కంటే ఎక్కువ కిందికి దిగజారింది.డిసెంబరు నెల రెండోవారానికి డాలర్‌ ఐదునెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో బంగారం ధర 5శాతం పెరిగింది.

 డాలర్ కనిష్ట స్థాయికి పడిపోయింది

డాలర్ కనిష్ట స్థాయికి పడిపోయింది

డిసెంబరు నెల రెండోవారానికి డాలర్‌ ఐదునెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో బంగారం ధర 5శాతం పెరిగింది. అమెరికాలో పన్ను మినహాయింపులు, కఠినతరమైన సెంట్రల్‌ బ్యాంకు ద్రవ్యపరపతి విధానాల వల్ల 2017లో డాలర్‌ మారకం విలువ పెరుగుతుందని ఎంతో మంది పెట్టుబడిదారులు అంచనా వేశారు. ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రోత్సాహక, ద్రవ్యోల్బణ విధానాలు అమలు చేస్తాడనే ఆశతో గ్రీన్‌బ్యాక్‌ సంస్థ స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టింది. అమెరికాలో పన్ను బిల్లు ఆమోదించినప్పటి నుంచి డాలర్‌, వడ్డీరేట్లు దిగువ స్థాయికి చేరుకున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gold prices rose to their highest level in one month on Thursday in light holiday trade and as the dollar fell to a four-week low. Spot gold was up 0.2 per cent at $1,289.10 an ounce at 0322 GMT, after earlier reaching its best since November 29 at $1,289.92. US gold futures were up 0.1 per cent at $1,292.20 an ounce.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి