బంగారం ప్రియుల ఆశలపై ళ్లు చల్లిన ట్రంప్
గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. అక్టోబర్ 17న రూ. 1.30 లక్షల రికార్డు గరిష్ట స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1.22 లక్షలకు తగ్గింది. ఈ ట్రెండ్‌తో సామాన్య ప్రజలు, 'నవంబర్ నాటికి లక్ష రూపాయల కంటే తక్కువకు వస్తుందేమో' అని కలలు కంటున్న సమయంలో, అమెరికా రాజకీయాల నుంచి పెను హెచ్చరిక వచ్చింది.
అమెరికన్ బిలియనీర్ పెట్టుబడిదారుడు రే డాలియో వాదన ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కంపెనీలపై విధించిన తాజా ఆంక్షలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రష్యా చమురు సరఫరా గొలుసు పరిమితం కావడంతో, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది. డాలియో ప్రకారం, ఇటువంటి ఆర్థిక ఆంక్షలు యూఎస్ డాలర్ బలాన్ని బెదిరించి, డాలర్‌పై పెరిగే ఒత్తిడి బంగారం ధరలలో భారీ పెరుగుదలకు దారితీస్తుంది.

బంగారం అనేది 'నాన్-ఫియట్ కరెన్సీ' కాబట్టి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అస్థిరత పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు దీన్ని సురక్షిత స్వర్గధామంగా భావిస్తారు. ట్రంప్ నిర్ణయం ఆంక్షల ప్రభావాన్ని పెంచడంతో, బంగారంపై డిమాండ్ మళ్లీ పెరుగుతుంది. దీనికి తోడు, త్వరలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే, డాలర్ మరింత బలహీనపడి బంగారం ధరలు మళ్లీ భగ్గుమనడం ఖాయమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయని ఆశించడం అమాయకత్వమే అవుతుందని, అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ప్రస్తుత ధరలను పరిశీలించి వెంటనే కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయమని విశ్లేషకులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications