బంగారం ధరల్లో హ్యూజ్ డ్రాప్: దీని దెబ్బకు..!!
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారత్ లో బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.. వాటిల్లో మార్పులకు కారణమవుతోంది. పసిడి గానీ, వెండి ధరలు గానీ స్థిరత్వాన్ని కోల్పోతోన్నాయి.. దీని దెబ్బకు. అమెరికా, ఇరాన్ మధ్య పశ్చిమ ఆసియాలో మళ్లీ చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతల కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి కొనుగోళ్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. పండగ సీజన్ కూడా దీనికి తోడైంది.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర 0.4 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 4,372.19 డాలర్ల వద్ద కొనసాగింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం క్షీణించి 4,416 డాలర్లకు పరిమితమైంది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభం అయ్యే సమయానికి వెండి కేజీ ఫ్యూచర్స్ ధర ఏకంగా 0.10 శాతం పెరిగి రూ.2,39,380 వద్ద స్థిరపడింది. పసిడి రేట్లు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 0.05 శాతం స్వల్ప క్షీణతను నమోదు చేసింది.

మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే నేడు 24 క్యారెట్ల బంగారం ధర 1,040, 22 క్యారెట్లు 950, 19 క్యారెట్లు 780 రూపాయల మేర తగ్గుముఖం పట్టింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,770, 22 క్యారెట్లు రూ. 1,40,039, వెండి కిలో రూ. 2,38,700 వద్ద స్థిరపడింది.
బెంగళూరులో ఇవే రేట్లు వరుసగా రూ. 1,52,890, రూ. 1,40,149, రూ. 2,38,890గా నమోదయ్యాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్లు రూ. 1,53,010, 22 క్యారెట్లు రూ. 1,40,259, వెండి రూ. 2,39,080 వద్ద కొనసాగింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1,53,210, 22 క్యారెట్లు రూ. 1,40,443, వెండి రూ. 2,39,390 వద్ద ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,431, 22 క్యారెట్లు - రూ. 14,146, 18 క్యారెట్లు - రూ. 11,915
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు - రూ. 11,573
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు - రూ. 11,573
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు - రూ. 11,573
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు - రూ. 11,573
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు - రూ. 11,573

Click it and Unblock the Notifications