అమెరికా నిర్ణయంతో బంగారం భగ్గు.. శ్రావణ శోభకు పసిడి షాక్

శ్రావణ మాసం రాకతో దేశమంతటా పండుగల కోలాహలం మొదలైంది. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా వేడుకల కోసం పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు, కుటుంబాలు సిద్ధమవుతున్న వేళ మార్కెట్‌లో పసిడి ధరలు షాకిస్తున్నాయి.

పెళ్లిళ్ల సీజన్, పండుగల సెంటిమెంట్‌కు తోడు గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరలు ఒక్కసారిగా రాకెట్ స్పీడ్‌ అందుకున్నాయి. ఈ ఒక్క వారంలోనే పసిడి ఏకంగా 5 శాతం మేర ప్రియమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,620 డాలర్ల దాకా చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాముల తులానికి రూ. 1,60,780 దాటేసింది. గడిచిన రెండున్నర నెలల కాలంలో పసిడి ఈ స్థాయి గరిష్ఠ రేటును తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Gold Rally Explained Why Prices Are Soaring And How New Investors Should Approach Buying Today

ధరలు ఒక్కసారిగా పెరగడానికి అసలు కారణాలేంటి?

అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలే ఈ సడన్ ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తమ రుణాలు తగ్గించుకునేందుకు బాండ్ల బైబ్యాక్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడంతో డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ ఒక్కసారిగా క్షీణించాయి.

మరోవైపు అమెరికాపై 40 ట్రిలియన్ డాలర్లకు పైగా అప్పుల భారం పెరగడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విదేశీ కరెన్సీల కంటే సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించే పసిడి వైపే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

వామ్మో.. పసిడి ధరలు చూసి నివ్వెరపోతున్న సామాన్యుడు
వామ్మో.. పసిడి ధరలు చూసి నివ్వెరపోతున్న సామాన్యుడు

మున్ముందు బంగారం బాట ఎటు?

బులియన్ మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం... బంగారం గతంలో ఉన్న రూ. 1,53,000 - 1,56,000 పరిధి నుంచి దాటుకుని ఇప్పటికే రూ. 1,58,500 మైలురాయిని దాటేసింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ. 1,62,000 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అమెరికా డాలర్ కదలికలు , మధ్యప్రాచ్య దేశాలలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా పసిడి గమనం మారే అవకాశం ఉంది.

ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారంతో ఆదాయం.. సరికొత్తగా ఆ గోల్డ్ స్కీమ్!
ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారంతో ఆదాయం.. సరికొత్తగా ఆ గోల్డ్ స్కీమ్!

ఈ పరిస్థితుల్లో పసిడి ప్రియులు, ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పండుగల సీజన్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో వినియోగదారులు, కొత్త ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలో నిపుణులు స్పష్టమైన సలహా ఇస్తున్నారు. గతంలోనే బంగారం కొనుగోలు చేసినవారు లేదా ఇన్వెస్ట్ చేసినవారు తమ వద్ద ఉన్న పసిడిని అలాగే ఉంచుకోవడం మంచిది. ప్రస్తుతం రేట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నందున, తొందరపడి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. ధరలలో ఏవైనా తాత్కాలిక తగ్గుదలలు వచ్చినప్పుడు మాత్రమే విడతలవారీగా కొనుగోలు చేయడం అత్యంత ఉత్తమమైన వ్యూహమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+