విరుచుకుపడ్డ బంగారం ధరలు! భగ్గుమన్న వెండి

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగడం, అమెరికా-ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం కావడం ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ వ్యాపారంలో నెలకొన్న ఈ అనిశ్చితి కారణంతో రెండు రోజుల పాటు కాస్త శాంతించిన బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కష్టకాలంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపే ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో దేశీయంగానూ రేట్లు పైకి ఎగబాకాయి.

భారీగా పెరిగిన రేట్లు

జూలై 30, గురువారం నాటి లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారట్ల మేలిమి బంగారం గ్రాముపై రూ.82 పెరిగి రూ.14,433కు చేరుకోగా, 100 గ్రాముల ధర రూ.8,200 మేర ఎగబాకి రూ.14,43,300 వద్ద స్థిరపడింది.

అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ల బంగారం గ్రాముపై రూ.75 పెరిగి రూ.13,230 కాగా, 100 గ్రాముల ధర రూ.7,500 పెరిగి రూ.13,23,000గా నమోదైంది.

ఇక 18 క్యారట్ల పసిడి గ్రాముకు రూ.62 పెరుగుదలతో రూ.10,825 వద్ద, 100 గ్రాములకు రూ.6,200 పెరిగి రూ.10,82,500 వద్ద విక్రయమవుతోంది. మరోవైపు వెండి ధర గ్రాము రూ.235, కిలో రూ.2,35,000 గా నమోదైంది.

Gold Rate Update Gold Prices Rise on July 30 Amid Global Uncertainty and Middle East Crisi
పసిడి పుట్టుక ఎలాగో తెలుసా? సైంటిస్టులు కనిపెట్టిన రహస్య
పసిడి పుట్టుక ఎలాగో తెలుసా? సైంటిస్టులు కనిపెట్టిన రహస్య

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల ధరలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధరలు ఒకే రీతిలో పెంపును నమోదు చేశాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.820 పెరిగి రూ.1,44,330గా ఉంది. 10 గ్రాముల 22 క్యారట్ల ఆభరణాల పసిడి ధర రూ.750 పెరిగి రూ.1,32,300 కాగా, 10 గ్రాముల 18 క్యారట్ల రేటు రూ.620 పెరిగి రూ.1,08,250 వద్ద వ్యాపారం సాగిస్తోంది.

బంగారం, వెండి కొనేవారికి అలర్ట్: డేంజర్ బెల్స్ మోగుతున్నాయా?
బంగారం, వెండి కొనేవారికి అలర్ట్: డేంజర్ బెల్స్ మోగుతున్నాయా?

ఇతర మెట్రో నగరాల్లో పరిస్థితి

  • ముంబై, బెంగళూరు, కోల్‌కతా: ఈ నగరాల్లోనూ 10 గ్రాముల 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,330గా ఉండగా, 22 క్యారట్లు రూ.1,32,300, 18 క్యారట్లు రూ.1,08,250 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
  • చెన్నై: ఇక్కడ 10 గ్రాముల 24 క్యారట్ల ధర రూ.1,44,330 కాగా, 22 క్యారట్ల ధర రూ.1,32,300, , 18 క్యారట్ల రేటు రూ.1,10,450గా నమోదైంది.
  • ఢిల్లీ: దేశ రాజధానిలో 10 గ్రాముల 24 క్యారట్ల ధర రూ.1,44,480 కాగా, 22 క్యారట్ల రేటు రూ.1,32,450, అలాగే 18 క్యారట్ల పసిడి రూ.1,08,400కి చేరింది.
  • అహ్మదాబాద్: ఇక్కడ 10 గ్రాముల 24 క్యారట్ల పసిడి రూ.1,44,380గాను, 22 క్యారట్లు రూ.1,32,350గాను, 18 క్యారట్లు రూ.1,08,300 వద్ద అందుబాటులో ఉన్నాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+