పండగ సీజన్ లో బిగ్ రిలీఫ్ ఇచ్చిన బంగారం..
పండుగల సీజన్ సమీపించిన తరుణంలో దేశవ్యాప్తంగా పసిడి రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో చోటుచేసుకున్న వరుస మార్పులు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. రేట్లు అనుకూలంగా ఉంటోండటంతో కొనుగోళ్లు కూడా క్రమంగా ఊపందుకుంటోన్నాయి. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరల్లో భారీ పెరుగుదలలేవీ చోటు చేసుకోవట్లేదు.
దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,50,280 రూపాయలుగా నమోదైంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఈ ధర 1,37,750 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 1,12,710 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280, 22 క్యారెట్లు రూ. 1,37,750 వద్ద నిలిచింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280, 22 క్యారెట్లు 1,37,750, ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280, 22 క్యారెట్లు రూ. 1,37,750 గా రికార్డయ్యాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280 పలకగా.. 22 క్యారెట్లు రూ. 1,37,750 వద్ద ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,028, 22 క్యారెట్లు - రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,317
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218












Click it and Unblock the Notifications
