బంగారం ప్రియులకు బిగ్ అలెర్ట్
మీరు పసిడి ప్రేమికులా? పసిడిని పదిలంగా దాచుకోవాలని చూస్తున్నారా? బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే, ఈ వార్త మీకు ఎంతో కీలకం! ప్రపంచ ఆర్థిక పరిణామాలు, దేశీయ మార్కెట్లలో జరుగుతున్న హెచ్చుతగ్గులు మీ బంగారం కొనుగోలు ప్రణాళికలను ప్రభావితం చేయనున్నాయి. బంగారం ధరలు మళ్లీ ఆల్-టైమ్ రికార్డుల వైపు దూసుకుపోతుండగా, ఈ పసిడి పరుగు ఎక్కడ ఆగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం మార్కెట్ తాజా పరిస్థితులు, ధరల కదలికల గురించి ఓ లుక్కెద్దాం
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రికార్డు స్థాయికి చేరువవుతూ తులం బంగారం ధర మళ్లీ లక్ష రూపాయలకు చేరువైంది. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఒకవైపు ప్రపంచ స్వర్ణ మండలి వంటి నివేదికలు ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నా, అందుకు విరుద్ధంగా ధరలు పెరుగుతుండటం కొనుగోలుదారులను అయోమయంలో పడేస్తోంది.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు త్వరలో దిగివస్తాయని నిపుణులు చెబుతున్నప్పటికీ, గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు, జూలై 15న కూడా హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ.91,550కి చేరుకుంది. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులంపై రూ.170 పెరిగి రూ.99,880కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 0.28 శాతం తగ్గి 3347 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, భారత కరెన్సీ రూపాయి విలువ పుంజుకొని రూ.85.85 వద్ద కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఉన్నప్పటికీ, దేశీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం గమనార్హం.
మరోవైపు, బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నప్పటికీ, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతూ కొంత ఊరటనిస్తోంది. గత రెండ్రోజులుగా కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.1,25,000 వద్ద స్థిరంగా ఉంది. అయితే, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కిలో వెండి రూ.1,15,000గా ఉంది.












Click it and Unblock the Notifications