షాకిచ్చిన బంగారం

పసిడి ప్రియులకు షాకిస్తూ దేశ రాజధానిలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. మంగళవారం ఒక్కరోజే రూ.1,000 పెరిగి, 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛత గల పుత్తడి ధర రూ. లక్షకు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకటించింది. సోమవారం రూ.99,020 వద్ద ముగిసిన ధర, తాజాగా నాలుగు వారాల గరిష్టమైన రూ.1,00,020 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది జూన్ 19న కూడా బంగారం ధర రూ. లక్ష వద్ద ట్రేడయిన విషయం తెలిసిందే.

99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా మంగళవారం రూ.1,000 పెరిగి రూ.99,550కి చేరింది. గత మార్కెట్ ముగింపులో ఇది 10 గ్రాములకు రూ.98,550 వద్ద ఉంది.

Gold Rates in July 23 2025

వెండికీ పెరిగిన రెక్కలు: కిలో రూ.1.14 లక్షలకు జంప్!
బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. మంగళవారం కిలోగ్రాముకు రూ.3,000 పెరిగి రూ.1,14,000కు చేరుకుంది.

గ్లోబల్ మార్కెట్‌లో తగ్గుముఖం.. హైదరాబాద్‌లో దూకుడు!
అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం 0.28 శాతం తగ్గి ఔన్సుకు (28.3 గ్రాములు) 3,387.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ వెండి కూడా 0.11 శాతం తగ్గి ఔన్సుకు 38.89 డాలర్లకు చేరింది. అయితే, హైదరాబాద్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,850లకు, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,290లకు చేరింది. వెండి ధర ఏకంగా రూ.1.28 లక్షలకు ఎగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+