బంగారం ప్రియులకు బుధవారం స్వల్ప ఊరట..తులం ఎంతంటే..?
గత కొద్ది రోజులుగా భగ్గుమంటూ చుక్కలు చూపించిన పసిడి ధరలు ఈ రోజు (బుధవారం, అక్టోబర్ 15) కాస్త శాంతించాయి. పది రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్వల్ప పెరుగుదలను మాత్రమే నమోదు చేయడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు.
దేశీయంగా పసిడి పరిస్థితి
నేటి మార్కెట్ ట్రేడింగ్‌ను పరిశీలిస్తే.. 24 క్యారట్ల బంగారం ధర గ్రాముకు కేవలం రూపాయి మాత్రమే పెరిగి రూ.12,836 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే విధంగా, 22 క్యారట్ల గ్రాము బంగారం ధర కూడా రూపాయి పెరిగి రూ.11,766 వద్ద నమోదైంది. 18 క్యారట్ల గ్రాము బంగారం ధర సైతం రూపాయి పెరుగుదలతో రూ.9,627 వద్ద ఉంది. 100 గ్రాముల బంగారం ధరలలో కూడా రూ.100 స్వల్ప పెరుగుదల కనిపించింది.

తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో ధరలు:
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారట్ల ధర రూ.10 పెరిగి రూ.1,28,360 వద్ద నిలిచింది. 22 క్యారట్ల ధర రూ.100 పెరిగి రూ.1,17,660 గా నమోదైంది.
ముంబై, బెంగళూరు, కోల్‌కతా: ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా తెలుగు రాష్ట్రాల మాదిరిగానే ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు చేసి రూ.1,28,360 (24 క్యారట్లు, 10 గ్రాములు) వద్ద ట్రేడ్ అవుతోంది.
చెన్నై: చెన్నైలో మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.1,29,010 వద్ద పలుకుతోంది.
ఢిల్లీ, అహ్మదాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల ధర రూ.1,28,510 కాగా, అహ్మదాబాద్‌లో రూ.1,28,410 గా నమోదైంది.
తగ్గుదలపై నిపుణుల అప్‌డేట్:
పెరుగుతున్న ధరలతో ఆందోళన చెందుతున్న కొనుగోలుదారులకు, బంగారం కొనుగోలు అప్పుడే చేయండి అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. భవిష్యత్తులో ధరలు తగ్గుదలపై మరింత స్పష్టమైన అంచనాలు వస్తున్న నేపథ్యంలో, పెట్టుబడి లేదా కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోవాలని సూచించబడుతోంది.
గమనిక: ఈ కథనంలోని ధరలు మరియు అంచనాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి ఆర్థిక నిపుణులను సంప్రదించండి.












Click it and Unblock the Notifications