తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా బంగారు అవకాశం. గత నెలంతా ఊపందుకొని ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. రెండు రోజుల నుంచి పసిడి మార్కెట్‌లో కనిపిస్తున్న భారీ పతనం కొనుగోలుదారులకు తీపికబురు అందిస్తోంది. అక్టోబర్ 23, గురువారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు కుప్పకూలాయి. ప్రధానంగా, తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి.
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర ఒక్కరోజే ఏకంగా రూ.810 తగ్గి, రూ.1,25,080 వద్ద ట్రేడ్ అవుతోంది.అదేవిధంగా, 22 క్యారట్ల బంగారం ధర రూ.750 తగ్గి, రూ.1,14,650 పలుకుతోంది.పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత ఊరటనిస్తూ, 100 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారట్ల బంగారం ధర రూ.8,100 మేర పతనమైంది.

పతనానికి ప్రధాన కారణాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న సానుకూల పరిణామాలే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.టారిఫ్ యుద్ధంపై సానుకూల చర్చలు జరుగుతున్నాయనే సంకేతాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి అయిన బంగారం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ విలువ పెరగడం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు వంటి అనిశ్చితి అంశాలు తగ్గడం కూడా మార్కెట్లను స్థిరీకరించింది. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో పైన తెలిపిన విధంగా ధరలు భారీగా తగ్గాయి. ముంబై, బెంగళూరు, కలకత్తా వంటి నగరాల్లోనూ ఇదే తరహా పతనం నమోదైంది.
మొత్తంగా, వివాహాది శుభకార్యాల సీజన్ ముంగిట ఈ భారీ ధరల తగ్గుదల బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న మధ్యతరగతి, ధనిక వర్గాలకు ఇది గొప్ప అవకాశంగా మారింది. ఆకాశాన్ని తాకిన ధరలు తగ్గడంతో, మీ నగలు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్ పోకడలను గమనించి, ఆచితూచి కొనుగోలు నిర్ణయం తీసుకోండి.












Click it and Unblock the Notifications