పండగ వేళ బంగారం ధరల ట్రెండ్ అనూహ్యం.. !!

దేశీయ మార్కెట్‌లో పండుగల సీజన్ సమీపిస్తుండటంతో పసిడి, వెండి కొనుగోళ్లకు డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్థిరంగా ఉన్న బులియన్ ట్రెండ్‌లు, అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ, పండుగల వేళ వినియోగదారుల షాపింగ్ కొనుగోళ్లు దేశీయంగా పసిడి ధరలను ప్రభావితం చేస్తోన్నాయి. ఈ వారం కూడా ధరల ట్రెండ్ ఇదే రీతిలో కొనసాగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సవాళ్లు, వడ్డీ రేట్ల స్థితిగతులు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత రాబడినిచ్చే పసిడి వైపు మొగ్గు చూపేలా చేస్తోన్నాయి. ఇలాంటి సమయంలో సురక్షితమైన ఆస్తిగా భావించే పసిడికి డిమాండ్ పెరగడం సర్వసాధారణం. దీనికి తోడు పండగల సీజన్ కావడం వల్ల కొనుగోళ్లు కూడా పెరిగి రిటైల్ మార్కెట్లో ధరలు స్వల్పంగా పురోగమించాయి.

Gold rates in the international market have been fluctuating over the past few weeks experienced

ఫలితంగా.. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కూడా పసిడి, వెండి కాంట్రాక్టులు లాభాల్లో నడిచాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 0.11 శాతం మేర పెరిగి 10 గ్రాములకు రూ.1,47,970 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ 0.51 శాతం లాభంతో కిలోకు రూ. 2,12,370 వద్ద కొనసాగింది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,590 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,35,291 వద్ద స్థిరపడగా.. వెండి కిలోకు రూ. 2,11,650 వద్ద నిలిచింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,710 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,35,401 వద్ద స్థిరపడగా.. వెండి కిలోకు రూ. 2,11,820 వద్ద నిలిచింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,830 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,35,511 వద్ద స్థిరపడగా.. వెండి కిలోకు రూ. 2,11,990 వద్ద నిలిచింది. చెన్నైలో ఇవే రేట్లు రూ. 1,48,020, రూ. 1,35,685, రూ. 2,12,270 గా నమోదయ్యాయి.

మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ, మరో 70 మందిపై ఎఫ్ఐఆర్
మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ, మరో 70 మందిపై ఎఫ్ఐఆర్

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,125

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,766, 22 క్యారెట్లు - రూ. 13,535, 18 క్యారెట్లు - రూ. 11,074

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+