బంగారంలాంటి ఉద్యోగం: రూ.కోట్లలో జీతాలు, భారీ బోనస్‌లు!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు రికార్డులను బద్దలు కొడుతుంటే, హాంకాంగ్‌లో మాత్రం ఆ లోహాలతో వ్యాపారం చేసే 'ట్రేడర్ల' డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. ఆసియాలోనే అతిపెద్ద బులియన్ హబ్‌గా అవతరించాలని హాంకాంగ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు అక్కడ నియామక మార్కెట్‌ను హీటెక్కిస్తున్నాయి. గ్లోబల్ బ్యాంకులు మొదలుకొని ఫిన్‌టెక్ స్టార్టప్‌ల వరకు ప్రతిభావంతులైన ట్రేడర్ల కోసం క్యూ కడుతుండటంతో, బులియన్ మార్కెట్‌లో సరికొత్త 'టాలెంట్ వార్' మొదలైంది.

విలువైన లోహాల వ్యాపారాన్ని విస్తరిస్తున్న సంస్థలు నిపుణులైన ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలకు వార్షిక వేతనం సుమారు HK$3 మిలియన్లు (దాదాపు ₹3.2 కోట్లు) వరకు పలుకుతోంది. విశేషమేమిటంటే, మొదటి ఏడాదిలోనే జీతంతో సమానమైన మొత్తాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు కూడా కంపెనీలు వెనుకాడటం లేదు. మధ్య స్థాయి అధికారులకు సైతం గతంలో కంటే 30 శాతం అదనంగా వేతనాలు అందుతున్నాయి.

Gold Rush in Hong Kong Global Banks Compete for Talent with Multi-Million Dollar Packages as Market Expands

మళ్ళీ రేసులోకి దిగ్గజ బ్యాంకులు..

ఒకప్పుడు బులియన్ వ్యాపారాన్ని తగ్గించుకున్న డ్యుయిష్ బ్యాంక్ వంటి దిగ్గజాలు ఇప్పుడు మళ్లీ ఈ రంగంలోకి దూసుకొస్తున్నాయి. వీటితో పాటు ట్రాఫిగురా, గున్వోర్ వంటి కమోడిటీ ట్రేడింగ్ హౌస్‌లు, చైనీస్ సెక్యూరిటీ సంస్థలు సైతం హాంకాంగ్‌లో తమ బృందాలను భారీగా విస్తరిస్తున్నాయి. కేవలం సాంప్రదాయ బ్యాంకింగ్ మాత్రమే కాకుండా, డిజిటల్ గోల్డ్ టోకెన్లను విక్రయించే క్రిప్టో, ఫిన్‌టెక్ కంపెనీలు కూడా సేల్స్ నిపుణుల కోసం గాలిస్తున్నాయి.

ప్రపంచం నలుమూలలా వేట..

హాంకాంగ్‌లో నిపుణుల కొరత ఉండటంతో రిక్రూటర్లు ఇప్పుడు లండన్, న్యూయార్క్, దుబాయ్ వంటి నగరాల్లో ఉన్న ట్రేడర్లపై కన్నేశారు. ప్రస్తుతం లింక్డ్‌ఇన్‌లో హెచ్‌ఎస్‌బిసి (HSBC), బ్యాంక్ ఆఫ్ చైనా, ఐసిబిసి (ICBC) వంటి దిగ్గజాలు వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నాయి. కొత్తగా వస్తున్న కంపెనీల ధాటికి ఉన్న ఉద్యోగులు చేజారిపోకుండా ఉండేందుకు, పాత కంపెనీలు తమ వేతన నిర్మాణాలను సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హాంకాంగ్ ప్లాన్ అదేనా?..

లండన్‌కు ధీటైన ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే హాంకాంగ్ ప్రధాన లక్ష్యం. దీని కోసం ప్రభుత్వం పన్ను రాయితీలు ప్రకటించడంతో పాటు, చైనా-స్నేహపూర్వక సెంట్రల్ బ్యాంకులను ఆకర్షించేందుకు ప్రత్యేక క్లియరింగ్ వ్యవస్థలను కూడా సిద్ధం చేస్తోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం ద్వారా $3.9 బిలియన్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ లాభాల్లో సింహభాగాన్ని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న కంపెనీలు, ఇప్పుడు ట్రేడర్ల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. మొత్తానికి, పసిడి మార్కెట్ పరుగుతో పాటు హాంకాంగ్‌లో ట్రేడింగ్ ఉద్యోగాలకు ఇప్పుడు 'గోల్డెన్ డేస్' నడుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+