బంగారం ధరల్లో భారీ పతనం: మార్కెట్ ఎంట్రీ పాయింట్

దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు కిందటి వారంలో ఊహించని విధంగా భారీగా క్షీణించాయి. ముఖ్యంగా వెండి ధరలు ఫ్యూచర్స్ మార్కెట్ లోనూ గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ రికార్డులు సృష్టించిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో సామాన్య కొనుగోలుదారులు, ముఖ్యంగా రాబోయే పండుగ సీజన్ కోసం నిరీక్షిస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభించింది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా నివేదికల ప్రకారం.. గత అయిదు రోజుల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రికార్డుస్థాయికి క్షీణించింది. వెండి రేట్లు కూడా అదే బాట పట్టాయి. కేజీకి సుమారు రూ. 6,536 మేర పతనమైంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న వ్యూహాత్మక మార్పులు ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెలువడుతున్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌ ధరలను శాసిస్తున్నాయి.

Gold Slides 0 94 percent as Middle East Tensions Oil Rise and Strong Dollar Fed s policy Pressure

దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ పుంజుకోవడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణకు ప్రాధాన్యతను ఇస్తోన్నారు. ఈ విక్రయాల ఒత్తిడి కారణంగానే దేశీయ మార్కెట్లలో గత సోమవారం నుంచి శుక్రవారం వరకు పసిడి, వెండి ధరలు వరుసగా క్షీణించాయి. దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టిన వారికి ఆందోళనకు గురి చేశాయి.

ఆకాశాన్నంటుతున్న పూలు, పండ్ల రేట్లు
ఆకాశాన్నంటుతున్న పూలు, పండ్ల రేట్లు

బంగారం ధరల్లో చోటుచేసుకున్న ఈ తాత్కాలిక సవరణ సీజనల్ కొనుగోలుదారులకు మార్కెట్ ఎంట్రీ పాయింట్ అందించినట్టయింది. పండుగ షాపింగ్ ప్లాన్ చేసుకునేవారికి ఇదే సరైన సమయంగా భావిస్తోన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ధరలలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక పరంగా చూస్తే పసిడి, వెండి ధరలు ఎప్పటికీ లాభదాయకంగానే ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తోన్నారు.

సంజు శాంసన్ ఫ్లాప్ షో- తడాఖా చూపిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్
సంజు శాంసన్ ఫ్లాప్ షో- తడాఖా చూపిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్

గత సెషన్లలో భారీ క్షీణత నమోదు చేసిన అనంతరం, బంగారం ధరలు క్రమంగా కోలుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 1.50 లక్షల రూపాయలకు పడిపోయిన తర్వాత కూడా క్రమంగా 1.65 లక్షలకు చేరిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా బంగారం రేట్లు క్రమంగా పెరుగుదల బాట పట్టొచ్చని చెబుతున్నారు. మంగళవారం నాటి ట్రేడింగ్ పాజిటివ్ గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+