EPFO: పెన్షన్ పెంపు! ESI పరిధిలోకీ మరిన్ని వర్గాలు!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, లక్షలాది మంది పెన్షనర్ల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS, 1995) కింద ప్రస్తుతం అందుతున్న రూ.1,000 కనీస పెన్షన్ ఏమాత్రం సరిపోదని, దీనిని తక్షణమే పెంచాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా సిఫార్సు చేసింది. పెన్షన్ మొత్తం వాస్తవిక దృక్పథంతో, వృద్ధాప్యంలో గౌరవప్రదంగా జీవించేలా ఉండాలని కమిటీ స్పష్టం చేసింది.

నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ అనేది పెన్షనర్లను అవహేళన చేయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెన్షనర్లు మూడు రోజుల పాటు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనల నేపథ్యంలో లేబర్, టెక్స్‌టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన 15వ నివేదికలో సానుకూలంగా స్పందించింది. ద్రవ్యోల్బణం, పెరిగిన వైద్య ఖర్చులు, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈపీఎస్-1995 స్కీమ్‌ను పునఃసమీక్షించాలని, ఇందుకోసం బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయాలని సూచించింది.

Good News For EPFO Workers Panel Suggests Raising ESI Salary Limit And Boosting Monthly Minimum Pension

EPFO వేతన పరిమితి సవరణ.. ESI పరిధి విస్తరణ!

కేవలం పెన్షన్ మాత్రమే కాకుండా, కార్మికుల సామాజిక భద్రతపై కూడా కమిటీ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం రూ.21,000 వరకు వేతనం పొందుతున్న వారికి మాత్రమే అందుతున్న ఈఎస్‌ఐ (ESIC) ప్రయోజనాలను మరింత మందికి విస్తరించాలని కోరింది. ఇందుకోసం వేతన పరిమితిని తక్షణమే సవరించాలని అభిప్రాయపడింది. దీనివల్ల మధ్యతరగతి కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందే అవకాశం ఉంది.

మరిన్ని కీలక ప్రతిపాదనలు:

  • కాంట్రాక్ట్ వర్కర్లకు రక్షణ: పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగినప్పుడు రెగ్యులర్ వర్కర్ల మాదిరిగానే కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
  • కో-ఆర్డినేషన్ బోర్డు: లేబర్ కోడ్ల అమలును పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన ఒక శాశ్వత 'కో-ఆర్డినేషన్ బోర్డు'ను ఏర్పాటు చేయాలి.
  • పథకాల అమలు: ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో కార్మికులకు ఎంతవరకు అందుతున్నాయో ఈ బోర్డు నిరంతరం సమీక్షించాలి.

పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ సిఫార్సులు అమలులోకి వస్తే, దేశంలోని సుమారు 65 లక్షల మంది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం పోరాడుతున్న వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని కార్మిక సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+