హమ్మయ్యా.. అక్కడ తగ్గిన బంగారం ధరలు

బంగారం ప్రియులకు కొద్దిగా ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో కొద్దిరోజులుగా అప్రతిహతంగా దూసుకుపోతున్న పసిడి ధరల పరుగుకు ఈరోజు బ్రేక్ పడింది. గోల్డ్ రేటు ఆల్-టైమ్ రికార్డు అయిన 4000 డాలర్ల మార్క్‌ను తాకిన తర్వాత స్వల్పంగా వెనక్కి తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఈరోజు ఔన్సుపై ఏకంగా 60 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో, 4000 డాలర్ల రికార్డు మార్క్‌ నుంచి బంగారం ధరలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు $3990 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర స్వల్పంగా తగ్గినప్పటికీ, వెండి మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. పారిశ్రామిక, పెట్టుబడి గిరాకీ కారణంగా వెండి రేటు మాత్రం ఈరోజు కూడా పెరిగింది.

Good News for Gold Lovers Gold Price Drops from 4000 Mark How Much Did it Fall
వెండి రేటు 0.65 శాతం మేర పెరిగి, ప్రస్తుతం ఔన్స్ వెండి రేటు $49.74 వద్దకు చేరింది.పసిడి ధరల్లో ఈ స్వల్ప తగ్గుదల దీర్ఘకాలికంగా కొనసాగుతుందా లేదా అనేది అమెరికా షట్‌డౌన్, ఫెడ్ వడ్డీ రేట్లపై వచ్చే తదుపరి ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, కొద్దిరోజులుగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర కాస్త దిగిరావడం గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ గిరాకీ నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి.

హైదరాబాద్‌లో: 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 1,24,189కి చేరగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,839 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో: అత్యధికంగా 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,915గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,845గా ఉంది.

విశాఖపట్నంలో: 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,197గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,13,847 వద్ద ట్రేడవుతోంది.

వెండి జోరు: కిలోకు లక్షన్నర దాటిన ధర
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పరుగుపందెంలో పసిడికి ఏమాత్రం తీసిపోకుండా వెండి కూడా దూసుకెళ్తోంది.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,80,400 రికార్డు స్థాయిని తాకింది.

విజయవాడలో అత్యధికంగా రూ. 1,81,200 వద్ద వెండి ధర కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+