లోన్ తీసుకున్న వారికి షాక్.. వడ్డీ రేట్లు పెంచేసిన బ్యాంక్

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం 'హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్' తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. వివిధ కాలపరిమితుల రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను (MCLR) బ్యాంక్ సవరించింది. ఈ పెంపు విభిన్న కాలపరిమితులపై 10 బేసిస్ పాయింట్ల (0.10%) వరకు ఉంది. పెరిగిన ఈ కొత్త వడ్డీ రేట్లు జూన్ 8, 2026 నుంచే అధికారికంగా అమలులోకి వచ్చాయని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

ఇటీవలే జూన్ 5, 2026న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ రేట్లను పెంచకపోయినప్పటికీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం తన అంతర్గత నిధుల వ్యయాల ఆధారంగా వడ్డీ రేట్లను పెంచేసింది. ఈ సవరణ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యొక్క ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లు ఇప్పుడు 8.05 శాతం నుంచి 8.65 శాతం మధ్యకు చేరాయి.

HDFC Bank Hikes MCLR Lending Rates By 10 Bps Home Loan And Car Loan EMIs To Rise From June 2026

MCLR రేట్ల మార్పులు

కాలపరిమితి MCLR (జూన్ 8) MCLR (మే 7) మార్పు (bps)
ఓవర్‌నైట్ 8.10% 8.05% 5
1 నెల 8.05% 8.05% ఏమీ లేదు
3 నెలలు 8.20% 8.15% 5
6 నెలలు 8.35% 8.30% 5
1 సంవత్సరం 8.40% 8.35% 5
2 సంవత్సరాలు 8.55% 8.45% 10
3 సంవత్సరాలు 8.65% 8.60% 5

RBI వడ్డీ రేట్లు తగ్గించినా బ్యాంకులు మాత్రం..

అసలు ఈ MCLR అంటే ఏమిటి?

చాలా మందికి బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఈ ఎంసీఎల్ఆర్ (MCLR) పదం వినిపిస్తుంది. నిజానికి, ఆర్‌బీఐ 2016లో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఏ బ్యాంకైనా సరే కస్టమర్లకు రుణాలు ఇచ్చేటప్పుడు వసూలు చేయాల్సిన 'కనీస వడ్డీ రేటు'ను ఇది సూచిస్తుంది. బ్యాంకులు ఈ రేటు కంటే తక్కువకు రుణాలు ఇవ్వడానికి వీల్లేదు. అందుకే, ఈ రేటు పెరిగినప్పుడల్లా పాత, కొత్త రుణ గ్రహీతల లోన్ ఈఎంఐలు (EMI) ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి.

RBI గుడ్ న్యూస్: వడ్డీ రేట్లు పెరగవు. ఎందుకంటే!
RBI గుడ్ న్యూస్: వడ్డీ రేట్లు పెరగవు. ఎందుకంటే!

మరోవైపు, బ్యాంక్ తన బేస్ రేటును 8.80 శాతం వద్ద (ఇది డిసెంబర్ 26, 2025 నుంచి అమలులో ఉంది), అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (BPLR) 17.30 శాతం వద్దే ఉంచింది. ఏదేమైనప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో లోన్లు తీసుకున్న మధ్యతరగతి ప్రజల జేబులకు మరింత చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

FD వడ్డీ రేట్లు (అసంఘటిత)

కాలపరిమితి వడ్డీ రేటు (ఏడాదికి) సీనియర్ సిటిజన్లు
7 - 14 రోజులు 2.75% 3.25%
15-29 రోజులు 2.75% 3.25%
30-45 రోజులు 3.25% 3.75%
46-60 రోజులు 4.25% 4.75%
61-89 రోజులు 4.25% 4.75%
90 రోజులు 4.25% 4.75%
6 నెలల 1 రోజు 5.50% 6.00%
9 నెలల 1 రోజు 5.75% 6.25%
1 సంవత్సరం 6.25% 6.75%
15 నెలలు 6.35% 6.85%
18 నెలలు 6.45% 6.95%
21 నెలలు - 2 సంవత్సరాలు 6.45% 6.95%
2 సంవత్సరాలు 1 రోజు 6.45% 6.95%
2 సంవత్సరాల 11 నెలలు 6.45% 6.95%
2 ఏళ్ల 11 నెలల 1 రోజు 6.45% 6.95%
3 ఏళ్ల 1 రోజు 6.50% 7.00%
4 ఏళ్ల 7 నెలలు 6.40% 6.90%
4 ఏళ్ల 7 నెలల 1 రోజు 6.40% 6.90%
5 ఏళ్ల 1 రోజు - 10 సంవత్సరాలు 6.15% 6.65%
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+