'సత్యాగ్రహ'తో రాహుల్ నయా ట్రెండ్! ఇక దేశవ్యాప్త పోరాటాలన్నీ ఇక్కడే..

దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై ఒంటరిగా పోరాడుతున్న ప్రజల గొంతుకలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. బాధితులు ఎదుర్కొంటున్న అన్యాయాలను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, వారికి అండగా నిలిచేందుకు 'సత్యాగ్రహ' పేరిట ప్రత్యేక డిజిటల్ వేదికను శనివారం ప్రారంభించారు. దేశంలోని ఏ మూల నుంచి అయినా పౌరులు తమ ఆందోళనలు, పోరాటాల వివరాలను ఈ ప్లాట్‌ఫారమ్‌లో పంచుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలే ఆయుధాలని.. బాధితులంతా ఏకమైనప్పుడే అన్యాయంపై విజయం సాధించగలమని స్పష్టం చేశారు.

దేశంలో యువత, విద్యార్థులు, రైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం ఏదో ఒక మూల నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే విడివిడిగా సాగే ఈ పోరాటాల గొంతుకలు తరచూ తొక్కిపెట్టబడుతున్నాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకే 'సత్యాగ్రహ' వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. బాధితులు తాము చేసే పోరాటం చిన్నదైనా, పెద్దదైనా సంబంధిత వివరాలను ఇందులో నమోదు చేస్తే, అవి ప్రత్యక్షంగా ఒక ఇంటరాక్టివ్ మ్యాప్‌లో కనిపిస్తాయి. దీని ద్వారా దేశంలో ఎక్కడెక్కడ ఏ రకమైన ఉద్యమాలు జరుగుతున్నాయో ఒకే చోట స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది.

Rahul Gandhi Launches Satyagraha Digital Platform To Unite Public Protests Across India On Interactive Map
TCS మెడకు ఫామ్ 6 ఉచ్చు ? ఈసీతో పాటు టార్గెట్ చేసిన రాహుల్ ..!
TCS మెడకు ఫామ్ 6 ఉచ్చు ? ఈసీతో పాటు టార్గెట్ చేసిన రాహుల్ ..!

పార్లమెంట్ నుంచి వీధుల దాకా..

ఈ వేదిక ద్వారా ప్రజాపోరాటాలకు లభించే మద్దతుపై రాహుల్ గాంధీ స్పష్టమైన అభయం ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలబడటం తన బాధ్యత అని, మ్యాప్‌లో నమోదైన ఆందోళనలకు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే పార్లమెంట్ వేదికగా, రోడ్లపై చేసే ఆందోళనల్లో లేదా సంబంధిత అధికారులకు లేఖలు రాయడం ద్వారా బాధితుల తరఫున గళం విప్పుతానని పేర్కొన్నారు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ప్రజలు తమ కథనాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

మా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.. ఇది తథ్యం: తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ
మా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.. ఇది తథ్యం: తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ

ధరల మంట నుంచి మహిళా భద్రత దాకా..

ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, మహిళా భద్రత వంటి అనేక అంశాలపై పౌరులు నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలన్నింటికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా ఒకే చోటికి చేర్చడమే ఈ డిజిటల్ యత్నం యొక్క ముఖ్య ఉద్దేశం. పోరాడే వారు తమ పేరు, సమూహం వివరాలు, సమస్య స్వభావాన్ని సైట్‌లో నమోదు చేస్తే, అవసరమైన సాయాన్ని అందించడానికి తమ బృందం సిద్ధంగా ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. ఐక్యంగా నిలబడటమే అన్యాయాన్ని ఎదుర్కొనే అత్యంత శక్తివంతమైన మార్గమని ఆయన ఉద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+