వారికి శుభవార్త.. నేషనల్ హైవేస్ పై టోల్ మినహాయింపు ఫాస్ట్యాగ్ పై కేంద్రం వరం!
దివ్యాంగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది కేంద్రం. జాతీయ రహదారులపై ప్రయాణించే దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కల్పించింది. అర్హులైన దివ్యాంగుల వాహనాలకు ఇచ్చే టోల్ మినహాయింపు ఫాస్ట్యాగ్‌కు సంబంధించిన జారీ, రెన్యువల్ నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. దీంతో కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
ఇప్పటివరకు అర్హులైన దివ్యాంగులు తమ టోల్ మినహాయింపు ఫాస్ట్యాగ్‌ను ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. దరఖాస్తు చేయడం, డాక్యుమెంట్స్ సమర్పించడం వంటి పనులు ప్రతి సంవత్సరం చేయాల్సి ఉండేది. దీనివల్ల చాలా మంది దివ్యాంగులకు ఇబ్బంది కలుగుతుండేది. తాజా మార్పులతో ఈ వార్షిక రెన్యువల్ అవసరం తొలగిపోయింది. ఇకపై వైకల్య శాతాన్ని బట్టి ఫాస్ట్యాగ్ ఎన్ని సంవత్సరాలు చెల్లుబాటు అవుతుందో నిర్ణయిస్తారు.

70 శాతం నుంచి 100 శాతం వరకు వైకల్యం ఉన్నవారికి ఇచ్చే టోల్ మినహాయింపు ఫాస్ట్యాగ్ ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. 40 శాతం నుంచి 70 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి మూడేళ్ల పాటు చెల్లుబాటు ఉంటుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం రెన్యువల్ కోసం తిప్పలు పడాల్సిన అవసరం లేకుండా పోతుంది.
ఈ ప్రత్యేక ఫాస్ట్యాగ్ కేవలం దివ్యాంగుల వినియోగం కోసం తయారు చేసిన వాహనాలకు, అలాగే 'దివ్యాంగజన్' ఓనర్‌షిప్‌తో రిజిస్టర్ చేసిన వాహనాలకు మాత్రమే ఇస్తారు. దీనికి డిసెబిలిటీ సర్టిఫికేట్, యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు లేదా అధికారిక రికార్డుల్లో నమోదైన వైకల్య శాతాన్ని చూసి నిర్ణయిస్తారు. నిర్ణయించిన కాలం ముగిసిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవచ్చు. అయితే అప్పటికీ అర్హత ఉండాలి.
నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఒకసారి ఫాస్ట్యాగ్ వచ్చిందంటే ఎప్పటికీ టోల్ కట్టనక్కర్లేదని అర్థం కాదు. వారికి ఇచ్చిన నిబంధనల మేరకు టోల్ ఉంటుంది. కేంద్రం ఈ మార్పులను దివ్యాంగుల జీవనం సులభం చేయడం కోసం తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద ప్రక్రియ సులభం కావడం, సమయం ఆదా కావడం, అనవసరపు తిప్పలు తగ్గడం ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.
సాధారణ వాహనాలకు వర్తించే ఫాస్ట్యాగ్‌కు ఈ నిబంధనలు వర్తించవు. కేవలం అర్హులైన దివ్యాంగుల వాహనాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. మొత్తంగా చూస్తే, ఈ కొత్త నిబంధనలు దివ్యాంగులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ప్రతి ఏడాది రెన్యువల్ చేయాల్సిన బాధ ఉండదు., మూడు లేదా ఐదు సంవత్సరాల పాటు వారు కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో టోల్ మినహాయింపు పొందవచ్చు












Click it and Unblock the Notifications
