Vande Bharat: తుప్పు పట్టిన టాయిలెట్లు, పగిలిన అద్దాలు! ప్రీమియం రైలుకే అధ్వాన పరిస్థితి

భారతీయ రైల్వే వ్యవస్థకే మకుటాయమానంగా భావించే 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్ రైలు నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అత్యంత వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యాలు ఉన్న రైలుగా ప్రచారం పొందిన ఈ రైలు లోపలి భాగంలో తుప్పు పట్టిన టాయిలెట్లు, విరిగిన గ్లాస్ ప్యానెళ్లు, మురికి పట్టిన బోగీలతో కనిపించడం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్‌లోని సబర్మతి - వెరావల్ మార్గంలో నడిచే వందే భారత్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఈ అధ్వాన పరిస్థితులను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ అంశం నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

హిమాంశు ముఖర్జీ అనే జియాలజిస్ట్ అక్టోబర్ 2న గుజరాత్ పరిధిలో నడిచే సబర్మతి - వెరావల్ వందేభారత్ రైలు 26901)లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో రైలు బయటి వైపు రంగు వెలిసిపోయి, మురికిగా ఉండటంతో పాటు, లోపలి భాగంలో అద్దాలు పగిలిపోయి, బాత్‌రూమ్‌లు తుప్పు పట్టి కనిపించాయి. దేశంలో తాను చూసిన అత్యంత అధ్వానమైన, మురికి పట్టిన వందేభారత్ రైలు ఇదేనంటూ ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సేవగా భావించే ఫ్లాగ్‌షిప్ రైలుకే ఈ పరిస్థితి రావడం ఏంటని ప్రశ్నిస్తూ.. సంబంధిత ఫోటోలను వెస్ట్రన్ రైల్వే అహ్మదాబాద్ డివిజన్ సహా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు టాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు.

Passenger Exposes Rusted Toilets and Broken Glass on Vande Bharat Express as Railways Fix Issues
Video: దూసుకెళ్లిన వందేభారత్.. స్పీడ్ పెంచి వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి
Video: దూసుకెళ్లిన వందేభారత్.. స్పీడ్ పెంచి వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి

గుజరాత్ పుణ్యక్షేత్రాల రూట్‌లో కలకలం

అహ్మదాబాద్ నగరాన్ని ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్న సౌరాష్ట్ర ప్రాంతంతో అనుసంధానించే క్రమంలో ఈ సబర్మతి - వెరావల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2025 మే నెలలో ప్రారంభించారు. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ప్రయాణించే ఈ మార్గంలో రైలు నిర్వహణ ఈ స్థాయిలో నిర్లక్ష్యానికి గురికావడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్- ఈ నెలలోనే- రెండే స్టాప్ లు..!
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్- ఈ నెలలోనే- రెండే స్టాప్ లు..!

వెంటనే అలర్ట్ అయిన డీఆర్‌ఎం..

సోషల్ మీడియాలో ఈ పిక్చర్స్ వైరల్ కావడంతో అహ్మదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ తక్షణమే స్పందించారు. ఈ ఫిర్యాదును తాము అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు వెల్లడించారు. ఫోటోల్లో కనిపించిన పరిస్థితులు రైల్వే నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవని అంగీకరిస్తూనే, ఇది కేవలం కొన్ని చోట్ల మాత్రమే జరిగిన చిన్నపాటి పొరపాటని వివరణ ఇచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే మెయింటెనెన్స్ సిబ్బంది రంగాంలోకి దిగి ఆయా బోగీల్లో ఉన్న లోపాలను, మురికిని పూర్తిగా శుభ్రం చేసి పునరుద్ధరించినట్లు వెల్లడించారు. బాగు చేసిన తర్వాత తీసిన కొత్త ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాదానికి ముగింపు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+