నొప్పులు నాటిన ఆశలు.. రితాంజలి మష్రూమ్ ఫామ్ విజయగాథ
తెల్లవారుజామున నాలుగు గంటలు. ఇంకా ఊరు నిద్రలోనే ఉంది. కానీ ఒడిశా కటక్ జిల్లా అంచున ఒక పొలంలో మాత్రం ఒక వ్యక్తి నెమ్మదిగా నడుస్తూ బెడ్‌లను పరిశీలిస్తున్నాడు. మెడ తిరగదు. నిటారుగా నిలబడటం కూడా కష్టం. అయినా రోజును మొదలుపెట్టే ఆ రైతు కళ్లలో అలసట లేదు... సంకల్పమే కనిపిస్తుంది. అతడే మనాస్ రంజన్ దాస్. అంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే నయం కాని వ్యాధితో బాధపడుతూ కూడా, వ్యవసాయాన్ని ఆశగా మార్చుకున్న ఓ అసాధారణ రైతన్న కథ ఇది. ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైన వెన్నంటే ఉండి భరోసా ఇచ్చే వ్యక్తి ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పడానికి మనస్ జీవిత ప్రయాణమే నిదర్శం
కటక్ జిల్లాకు చెందిన 45 ఏళ్ల మనాస్, తన భార్య రితాంజలి పేరు మీదుగా 'రితాంజలి మష్రూమ్ ఫామ్' నడుపుతున్నాడు. ఒకప్పుడు రోజుకు 16-17 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసిన వీడియో ఎడిటర్ మనాస్.వృత్తి ద్వారా వచ్చిన వ్యాధే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. మెడ, వెన్ను కదలికలు క్రమంగా ఆగిపోయాయి. లక్షలు ఖర్చు చేసినా ఉపశమనం లేదు. ఇది నయం కాదని వైద్యులు కూడా తేల్చి చెప్పారు.

బిఏ పూర్తిచేసిన తర్వాత శాంసంగ్ ఉత్పత్తులు అమ్మే మార్కెటర్‌గా, ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ వ్యాపార వేత్తగా పని చేసిన మనాస్... ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో అన్నీ వదిలేయాల్సి వచ్చింది. నెలకు రూ.10 వేలు కోసం పనిచేస్తున్న రోజుల్లో, ఒక గిరిజన గ్రామం సందర్శన అతని ఆలోచనలను మార్చేసింది. చిన్న గదుల్లో పుట్టగొడుగులు పెంచుతూ రోజుకు రూ.1,000 సంపాదిస్తున్న రైతులను చూసి ఆశ్చర్యపోయాడు. "వాళ్లు రోజుకు సంపాదిస్తున్నది... నేను నెలకు కూడా సంపాదించలేకపోతున్నా" అనే భావనే అతడిని కొత్త దారిలోకి నడిపింది.
మొదటి ప్రయత్నంలో విఫలం
తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడి, వేగంగా వచ్చే పంటలు... ఈ మూడు కారణాలే మనాస్‌ను ప్యాడీ స్ట్రా మష్రూమ్స్(పుట్టగొడుగుల సాగు) వైపు లాగాయి. 2017లో మొదటి ప్రయత్నం విఫలమైంది. సాంకేతిక పరిజ్ఞానం లేక రూ.20 వేల పెట్టుబడి మొత్తం నష్టమైంది. కానీ అదే పరాజయం అతడిని వెనక్కి నెట్టలేదు. ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలో శిక్షణ తీసుకుని, పుట్టగొడుగుల వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు. తేమ, ఉష్ణోగ్రత, గాలి ప్రవాహం... ప్రతిదీ నేర్చుకున్నాడు.
పగబట్టిన ప్రకృతి..
2018లో భార్య ద్వారా మహిళా స్వయం సహాయక బృందం నుంచి రుణం తీసుకుని వెదురు కర్రలు, షేడ్ నెట్‌లతో పాలిహౌస్ నిర్మించాడు. కానీ 2019లో ఫణి తుఫాన్... అన్నీ నేలమట్టం. నెలల తరబడి శిథిలాలను తొలగించి, మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాడు. ఈసారి తాత్కాలిక నిర్మాణాలు కాదు... శాశ్వత, వాతావరణ నిరోధక యూనిట్ ఏర్పాటు చేశాడు. ఐరన్ రాక్స్‌తో ఆటోమేటెడ్ వ్యవస్థను తన వద్ద ఉన్న పూర్తి స్థలంలో సిద్ధం చేశాడు.
పుట్టగొడుగులు అమ్ముడుపోకపోతే..
అంతే ఇంక ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. వెనకడుగు వేయలేదు. ఈ రోజు, రెండు ఎకరాల భూమిలో విస్తరించిన రితాంజలి మష్రూమ్ ఫామ్‌లో రోజుకు 20-25 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి అవుతున్నాయి. మార్కెట్ డిమాండ్ 40 కిలోల వరకు ఉంటుంది. అవసరమైతే చిన్న రైతులు, స్వయం సహాయక బృందాల నుంచి సేకరించి వారికి నష్టాలు రాకుండా చూస్తాడు. తాజా పుట్టగొడుగులు అమ్ముడుపోకపోతే... వాటిని ఎండబెట్టి పొడి, ఊరగాయలు, కుకీలుగా మార్చుతాడు. దిగుబడికి విలువ జోడింపే మా లక్ష్యం. ఈ రోజు అమ్ముడుపోకపోతే వాటిని రేపటికి ఉత్పత్తిగా మార్చేస్తాం అంటాడు మనాస్.
వినూత్న రైతుగా సత్కారం..
పుట్టగొడుగుల సాగుతో పాటు, సేంద్రీయ కూరగాయలు, శిక్షణ కార్యక్రమాలు కూడా అతని ఆదాయ మార్గాలే. ఇప్పటివరకు 700 మందికి పైగా రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చాడు. 2022లో నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అతడిని వినూత్న రైతుగా సత్కరించింది. ఫణి తుఫాన్ తర్వాత మళ్లీ నిలబడి, 2025 నాటికి దాదాపు రూ.9 లక్షల ఆదాయం సాధించాడు మనాస్. 2026 నాటికి షిటేక్, గనోడెర్మా వంటి ఔషధ గుణాలున్న పుట్టగొడుగుల సాగు లక్ష్యమని తెలిపాడు. "మేము కేవలం పంటలు కాదు... ఆరోగ్యాన్ని పండించాలనుకుంటున్నాం" అంటాడు అతడు.
మెడ కదలకపోయినా... మనాస్ ఆలోచనలు కదిలాయి. శరీరం వంగిపోయినా... ఆత్మ వంగలేదు. వ్యాధి అతడిని ఆపలేకపోయింది. ఈ రోజున రితాంజలి మష్రూమ్ ఫామ్ కేవలం ఒక వ్యవసాయ యూనిట్ కాదు... ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యం
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications