5 వేల పెట్టుబడితో 50 లక్షలు సంపాదించడం ఎలా అంటే..?
నాటి నుంచి నేటి వరకు.. భవిష్యత్తులో కూడా ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే అంశాల్లో డబ్బు ముఖ్యమైంది. ఆర్ధిక భరోసా కోసం ప్రజలు పలు పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటారు. వాటిలో రిస్క్ ఉన్నది ఒక మార్గం అయితే.. రిస్క్ లేనిది మరో మార్గం. రిస్క్ లేని పెట్టుబడి పథకాలు అంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, గోల్డ్ బాండ్లు ఇలా చాలానే ఉంటాయి.
అయితే.. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఇవి రిస్క్‌తో కూడుకున్నవే అయినప్పటికీ.. రాబడి మాత్రం లాంగ్ రన్‌లో ఊహించని విధంగా వస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు ఆ ప్లాన్ తోనే కేవలం 5 వేల పెట్టుబడితో.. 50 లక్షలు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం...

ప్రజెంట్ డేస్ లో.. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి.. SIP... అంటే సింపుల్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ఈ పద్ధతిలో కాలం గడుస్తున్న కొద్దీ అసలుపై వడ్డీ.. మళ్లీ వడ్డీపై వడ్డీ వస్తుంది. దీంతో అత్యధిక రాబడి పొందవచ్చని చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో 12 శాతాని కంటే ఎక్కువే ఉంటుందని అంటున్నారు. పెట్టుబడిదారులు రోజువారీగా, వారం వారీగా, నెలవారీగా.. త్రైమాసికంగా, వార్షికంగా పెట్టుబడులు చేసే వెసులుబాటు SIP లో ఉన్నాయని తెలుస్తోంది.
ఈ మేరకు 25 సంవత్సరాలు వయస్సులో ప్రారంభించి రూ.5,000 నెలవారీ పెట్టుబడిని 45 సంవత్సరాలు వరకూ పెడితే మొత్తం పెట్టుబడి రూ.12,00,000 లు అవుతుంది. అందుకు 12% వార్షిక రాబడిని కలిపితే రూ.50,00,000 పొందవచ్చని చెబుతున్నారు. అందుకే సరైన సమయంలో డబ్బును వృధా ఖర్చు చేయకుండా SIP ద్వారా పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు. అయితే పెట్టుబడి చేసే ముందు సదరు కంపెనీ పాస్ట్ రిటర్న్స్‌ను కూడా పరిశీలించాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. 12 శాతం వార్షిక రాబడితో ఈ అంచనా వేయడం జరిగింది. ఆర్థిక నిపుణుల సలహాతో సరైన పథకంలో పెట్టుబడి ప్రారంభించాలి.












Click it and Unblock the Notifications