డ్రీమ్ ఫోల్క్స్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న బ్యాంకింగ్ సంస్థలు..!
భారత్ లోని ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థలు ఇప్పుడు డ్రీమ్ ఫోల్క్స్ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. డ్రీమ్ ఫోల్క్స్ లో లాంజ్ సేవల అంతరాయం వల్ల విమాన ప్రయాణికులు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐసీఐసీఐ, యాక్సెస్ బ్యాంక్, మాస్టర్ కార్డ్ లాంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
డ్రీమ్ ఫోల్క్స్ అనేది విమానాశ్రయ సేవలను అందించే సంస్థ, ఇది విమానాశ్రయాలలో ప్రయాణీకులకు వివిధ రకాల సేవలను అందిస్తుంది. అయితే గతేడాది సెప్టెంబర్ 22 వ తేదీన
డ్రీమ్ ఫోల్క్స్ లోని సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా వేల మంది బ్యాంకు కస్టమర్లు, కార్డు వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమస్యను 24 గంటల్లో డ్రీమ్ ఫోల్క్స్ పరిష్కరించినప్పటికీ బ్యాంకింగ్ సంస్థలు మాత్రం ఇతర వ్యవస్థపై మొగ్గు చూపాలని భావిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఐసీఐసీఐ, మాస్టర్ కార్డ్, యాక్సెస్ బ్యాంకు ఇప్పటివరకైతే అధికారికంగా ప్రకటన చేయలేదు. అటు డ్రీమ్ ఫోల్క్స్ సంస్థ కూడా దీనిపై స్పందించలేదు. ఇక దేశంలోని అన్ని ప్రముఖ విమానాశ్రయాల్లో డ్రీమ్ ఫోల్క్స్ సంస్థ లాంజ్ సేవలను అందిస్తోంది. దేశంలోని వైమానిక మార్కెట్ లో 90శాతం షేర్ ఈ సంస్థ సొంతం.
అయితే గతేడాది సెప్టెంబర్ 22 వ తేదీన డ్రీమ్ ఫోల్క్స్ లోని లాంజ్ సేవలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో దేశంలోని 34 ఎయిర్ పోర్టుల్లో 49 లాంజ్ సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కోల్ కతా, చెన్నైలోని విమానాశ్రయాల్లో ఆహార సేవలు అందించే ట్రావెల్ ఫుడ్ అండే సర్సీసెస్ సంస్థ..డ్రీమ్ ఫోల్క్స్ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని బెదిరింపులు కూడా చేసింది.
ఇదే వ్యవహారంపై అదానీ గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ తమ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అంతరాయం లేకుండా సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరించారు. ఇక అదానీ గ్రూప్ దేశంలోని అనేక విమానాశ్రయాలను పర్యవేక్షిస్తోంది. GMR, అదానీ సంస్థలు కలిసి 80-85 శాతం విమానాశ్రయాలకు సేవలందిస్తున్నాయి. ఈ సంస్థలు థర్డ్-పార్టీ సంస్థల ద్వారా లాంజ్ సేవలనూ అందిస్తున్నాయి.

డ్రీమ్ ఫోల్క్స్ సంస్థ భారత్ లో విమానాశ్రయ సంబంధిత సేవలను అందించేందుకు 2013లో ఏర్పడింది. ఇది బ్యాంకులు, విమానయాన సంస్థలకు వివిధ రకాల సేవలను అందిస్తోంది. ఇందులో విమానాశ్రయ లాంజ్ సేవలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.1,292 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. మరోవైపు రూ. 65 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఈ సంస్థ లాంజ్ సేవలతో పాటు ఆహారం, కూల్ డ్రింక్స్, ప్రయాణ ఏర్పాట్లు వంటి ఇతర సేవలను కూడా అందిస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications