బాబ్బాబు!! క్రమశిక్షణకు కట్టుబడతాం: పరపతి ప్లీజ్.. ఫిచ్‌కు కేంద్ర ఆర్థికశాఖ వేడుకోళ్లు
న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణకు భారత్ కట్టుబడి ఉన్నదని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ ప్రతినిధులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శాఖ అధికారులు తెలిపారు. నిర్మాణాత్మక సంస్కరణలు, వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వ్యవస్థ కూడా గాడిలో పడుతున్నందున తమ ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరందుకుంటోందని చెప్పారు. ఈ తరుణంలో మళ్లీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా అవతరించినట్లు పేర్కొన్నారు.
ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని దేశ సార్వభౌమ రేటింగ్‌ను పెంచాలని అభ్యర్థించారు. భారత్ రేటింగ్‌పై వార్షిక సమీక్ష ప్రక్రియలో భాగంగా బుధవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తదితర ఉన్నతాధికారులతో ఫిచ్ డైరెక్టర్ (సావరీన్ రేటింగ్స్) థామస్ రూక్‌మాకెర్ సమావేశం అయ్యారు.

2020 - 21 నాటికి 3 శాతానికి ద్రవ్యలోటు కట్టడి చేస్తాం
ఆర్థిక క్రమశిక్షణ కార్యచరణ బాటలోనే ప్రభుత్వం పయనిస్తోందని, సవరించిన ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉందని ఫిచ్ డైరెక్టర్‌కు ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. 2020 - 21 నాటికి జీడీపీలో ద్రవ్య లోటును (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) మూడు శాతానికి కట్టడి చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జీఎస్టీ ఆదాయం 11 నెలలకే పరిమితమైనా ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేస్తున్నట్లు ఫిచ్ ప్రతినిధులకు వివరించారు.

పీఎస్‌యూల్లో వాటా విక్రయం కొనసాగింపు
జీఎస్‌టీ అమలులో సమస్యలతోపాటు ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (పీఎన్బీ) జరిగిన భారీ కుంభకోణంపై పలు అంశాలను ఫిచ్ ప్రతినిధులు లేవనెత్తినట్లు సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ తక్షణ ఎజెండాలో లేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. నష్టజాతక ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయం కొనసాగుతుందని.. ఈ ఏడాది వాటాల ఉపసంహరణ ఆదాయం రూ.లక్ష కోట్లను తాకిందని ఫిచ్ ప్రతినిధులకు వారు వివరించారు.

స్టాండర్డ్ అండ్ పూర్స్ ఇలా ‘బీబీబీ మైనస్'
ప్రస్తుతం ఫిచ్ ‘బీబీబీ మైనస్ (స్థిర ఔట్‌లుక్)' రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌లో ఇదే అత్యంత తక్కువస్థాయి రేటింగ్. చివరిసారిగా 2006లో ‘బీబీ ప్లస్' నుంచి ఇప్పుడు ఉన్న రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. నాటి నుంచి ఎలాంటి మార్పూ చేయలేదు. మధ్యలో ఔట్‌లుక్‌ను ప్రతికూలానికి మార్చినా, ఆ తర్వాత మళ్లీ స్థిరానికి చేర్చింది. కాగా, 14 ఏళ్ల తర్వాత మరో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గతేడాది నవంబర్‌లో భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ‘బీఏఏ3' నుంచి ‘బీఏఏ2'కు పెంచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఔట్‌లుక్‌ను (భవిష్యత్ రేటింగ్ అంచనా) కూడా స్థిరం నుంచి సానుకూలానికి మార్చింది. స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) మాత్రం 2007 నుంచి భారత్ రేటింగ్‌ను యథాతథంగానే (బీబీబీ మైనస్) కొనసాగిస్తోంది.

కేంద్రాన్ని నిరూత్సాహ పరిచిన ఫిచ్ రేటింగ్స్
ఇటీవలి కేంద్ర బడ్జెట్ తర్వాత ఫిచ్... భారత్‌కు ఉన్న అధిక రుణ భారమే రేటింగ్ పెంపునకు అడ్డంకిగా మారుతోందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం భారత్ జీడీపీతో పోలిస్తే రుణ భారం 69 శాతం మేర ఉంది. కాగా, ఈ ఏడాది (2017-18) ద్రవ్యలోటు లక్ష్యాన్ని తాజా బడ్జెట్‌లో కేంద్రం 3.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ నెలలో మూడీస్ రేటింగ్స్‌తో ఆర్థిక వ్యవస్థపై జోష్ నెలకొంటే, ఫిచ్ రేటింగ్స్ నిరుత్సాహపరిచింది.

ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నెలకొనలేదని స్పష్టీకరణ
బడ్జెట్ అంచనాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించినా.. అంతకంటే ముందే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.7 శాతానికి ఫిచ్ తగ్గించింది. ఆశించిన మేర ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నెలకొనలేదని పేర్కొంది. మరోవైపు 2018-19 ఆర్థిక సంవ్సరానికి వృద్ధి అంచనాను సైతం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.

బ్యాంకులకు పెట్టుబడి, జాతీయ రహదారులతో సానుకూల వాతావరణం
వచ్చే రెండేళ్లలో వ్యవస్ధాగత సంస్కరణల అజెండా అమలుతో పాటు వ్యక్తిగత వినిమయ ఆదాయాలు పెరగడంతో జీడీపీ వృద్ధి పుంజుకుంటుందని ఫిచ్ ఆశాభావం వ్యక్తం చేసింది. జీఎస్‌టీ,నోట్ల రద్దుతో ఇటీవల పలు క్వార్టర్లలో జీడీపీ వృద్ధి మందగించిందని అమెరికన్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలు వృద్ధికి ఊతమిచ్చి, వ్యాపారాల్లో విశ్వాసం పెంచుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. బ్యాంకులకు మూలధన సాయం, రూ ఏడు లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం వంటి చర్యలతో పెట్టుబడుల వాతావరణం ఊపందుకుంటుందని పేర్కొంది.

ఇంధన సర్ చార్జీ రేట్ల పెంపుపై ప్రైవేట్ విమాన సంస్థలు కుమ్మక్కు
వస్తు రవాణా విమానాలపై మూడు ప్రైవేట్ పౌర విమాన యాన సంస్థలు ఇంధన సర్ చార్జీ (ఫ్యూయల్ సర్ చార్జీ రేట్స్) ఫీజు వసూలు చేయడంలో కుమ్మక్కయ్యాయని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గుర్తించింది. సదరు విమానయాన సంస్థలు నిర్ధిష్ట ఫీజు వసూలు చేశాయని నిర్ణయానికి వచ్చింది. అందుకు జెట్ ఎయిర్ వేస్‌పై రూ.39.8 కోట్లు, ఇంటర్ గ్లోబ్‌పై రూ.9.4 కోట్లు, స్పైస్ జెట్‌పై రూ.5.1 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

2015లోనూ ఈ మూడు విమానయాన సంస్థలపై సీసీఐ ఫైన్ ఇలా
ఇంటర్ గ్లోబ్ సంస్థ ఆధ్వర్యంలో జెట్ ఎయిర్ వేస్, ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసులు నడుపుతోంది. ఇంధన ధరల్లో అనిశ్చితిని అడ్డు పెట్టుకుని ఈ విమాన సంస్థలు సర్ చార్జీ నిర్ణయించాయి. కానీ ఈ మూడు పౌర విమానయాన సంస్థలు మాత్రం దీనిపై అధికారికంగా ప్రతిస్పందించలేదు. 2015లోనూ సదరు విమాన యాన సంస్థలపై సీసీఐ జరిమాన విధించింది.












Click it and Unblock the Notifications