పెట్రోల్ బండ్లకు గుడ్‌బై.. భారత మార్కెట్‌ను ఊపేస్తున్న సరికొత్త రికార్డు!

భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ ఆల్-టైమ్ రికార్డును నమోదు చేసింది. పండగల డిమాండ్, సరికొత్త మోడళ్ల రాక, ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల్లో పెరిగిన ఆసక్తితో అక్టోబరులో రిజిస్ట్రేషన్లు ఏకంగా 48 శాతం పెరిగి 2.24 లక్షల యూనిట్లకు చేరాయి. వాహన్ డేటా ఆధారంగా ఈ రికార్డు నమోదైంది. సంప్రదాయ టూవీలర్ సంస్థలైన టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి సంస్థలు ఎలక్ట్రిక్ విభాగానికి మారడంలో తమ ఆధిక్యాన్ని నిరూపించుకుంటున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

చేతులపై నుంచి 100 కారులు, 100 బైకులు.. అన్నదమ్ముల రియల్ స్టంట్స్ !!
చేతులపై నుంచి 100 కారులు, 100 బైకులు.. అన్నదమ్ముల రియల్ స్టంట్స్ !!

హోరాహోరీగా రేసు.. అగ్రస్థానంలో టీవీఎస్
అక్టోబరులో 60,422 ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలతో టీవీఎస్ మోటార్ మార్కెట్లో అతిపెద్ద సంస్థగా నిలిచింది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు విక్రయం కాగా.. కంపెనీ మార్కెట్ వాటా 20.6 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది.

Indian Electric Two-Wheelers Sales Hit Record High in October as TVS Leads the Market Full Details Here

మరోవైపు బజాజ్ ఆటో 22 శాతం మార్కెట్ వాటాతో బలమైన స్థానాన్ని నిలబెట్టుకోగా.. హీరో మోటోకార్ప్ తన వాటాను 10.9 శాతం నుంచి 13.4 శాతానికి పెంచుకుంది. ఏథర్ ఎనర్జీ 31,796 రిజిస్ట్రేషన్లతో 5 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసినప్పటికీ.. మార్కెట్ తీవ్రంగా విస్తరించడంతో దాని వాటా 20 శాతం నుంచి 14.2 శాతానికి తగ్గింది. ఓలా ఎలక్ట్రిక్ మాత్రం సవాళ్లను ఎదుర్కొంటోంది. అక్టోబరులో దాని విక్రయాలు 26 శాతం తగ్గి 12,096 యూనిట్లకు పరిమితమవ్వడంతో మార్కెట్ వాటా 10.9 శాతం నుంచి 5.4 శాతానికి పడిపోయింది.

నమోదైన బలమైన వృద్ధి
జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల నమోదు 15 లక్షల యూనిట్లను దాటింది. 2025లో ఇదే సమయానికి నమోదైన 9.61 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది అత్యధికం. 2025 ఏడాదంతా కలిసి మొత్తం 13.42 లక్షల యూనిట్లు నమోదు కాగా.. ఇప్పుడు సెప్టెంబర్ నాటికే ఆ సంఖ్య దాటిపోవడం గమనార్హం. ఛార్జింగ్ సౌకర్యాలు మెరుగుపడటం, పెట్రోల్ ధరల భారంతో వినియోగదారులు ఈ-స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

నందమూరి మోక్షజ్ఞ హీరోయిన్ వేటలో బిగ్ ట్విస్ట్..!
నందమూరి మోక్షజ్ఞ హీరోయిన్ వేటలో బిగ్ ట్విస్ట్..!

బడ్జెట్ వినియోగదారులే లక్ష్యంగా కొత్త మోడళ్లు
మిడిల్ క్లాస్, ఫ్యామిలీ వినియోగదారులను ఆకట్టుకునేలా తక్కువ ధరకు వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం విక్రయాల పెరుగుదలకు కారణమైంది. టీవీఎస్ సంస్థ రూ.84,500 ప్రారంభ ధరతో 'ఆర్బిటర్ వి1'ని మార్చిలో విడుదల చేయగా.. బజాజ్ ఆటో రూ.91,399 ప్రారంభ ధరతో 'చేతక్ సీ25'ను జనవరిలో మార్కెట్లోకి తెచ్చింది. హీరో మోటోకార్ప్ ఆగస్టులో రూ.1.13 లక్షల ధరకు 'విడా వీఎక్స్2 గో ఎఫ్బీ'ని విస్తరించగా.. ఏథర్ ఎనర్జీ ఆగస్టులో రూ.99,999కి 'కోనార్క్' మోడల్‌ను పరిచయం చేసింది.

పెరుగుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల వాటా
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2022లో కేవలం 6 శాతంగా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు, ఆర్థిక సంవత్సరం 2027 నాటికి మొత్తం స్కూటర్ విక్రయాలు 24.1 శాతానికి చేరాయి. టూవీలర్ మార్కెట్లో ఈ -వాహనాల పెరుగుదల ఆర్థిక ఏడాది 2024లోని 5.5 శాతం నుంచి ఆగస్టు నాటికి 9.9 శాతానికి పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+