Stock Market: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ.. రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

ప్రపంచ మార్కెట్లను ట్రేడ్ వార్ భయాలు ముంచెత్తడంతో, భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల భయాల నేపథ్యంలో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ నెలకొనడంతో, సెన్సెక్స్ , నిఫ్టీ 50 సూచికలు నష్టాలను మిగిల్చాయి..

సెన్సెక్స్ 930.67 పాయింట్లు ( 1.22 శాతం ) పతనమై 75,364.69 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345.65 పాయింట్లు ( 1.49 శాతం ) నష్టపోయి 22,904.45 వద్ద స్థిరపడింది. మార్కెట్లో కేవలం 1081 షేర్లు మాత్రమే లాభపడగా, ఏకంగా 2721 షేర్లు నష్టాల బాట పట్టాయి. 131 షేర్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.

indian-stock-markets-lose-rs-11-lakh-crore-in-a-single-day

మదుపర్లు తమ ఈక్విటీ హోల్డింగ్‌లను విక్రయించడంతో, ఒక్కసారిగా 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. నిఫ్టీ 50 సూచికలో, ONGC, హిందాల్కో, సిప్లా వంటి దిగ్గజ కంపెనీలు వరుసగా ఆరు శాతానికి పైగా కుప్పకూలాయి. సుంకాల భయాలతో అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్ మరింత క్షీణించింది.

ఆటో, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల సూచీలు భారీగా పడిపోవడంతో, అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 , నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 మధ్యాహ్నం సెషన్‌లో మూడు శాతం వరకు పడిపోవడంతో చిన్న , మధ్య తరహా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టపోయాయి.

The domestic stock market ended with heavy losses The Sensex fell 930 67 points 1 22 percent to close at 75 364 69 The Nifty also fell 345 65 points 1 49 percent to settle at 22 904 45

"అంచనాలకు మించిన పరస్పర సుంకాలు, ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణం, కంపెనీల ఆదాయాలపై పెరిగిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది," అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. "భారతీయ మార్కెట్, చాలా రంగాల, స్టాక్‌ల అధిక వాల్యుయేషన్లు సంభావ్య నష్టాలను పెద్దగా పట్టించుకోలేదని సూచిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+