రూ. 1299 నుంచే ఫ్లైట్ టికెట్స్.. ఇండిగో బంపర్ ఆఫర్ !!
విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండిగో సంస్థ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. "గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్" పేరుతో స్పెషల్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ కింద దేశీయ రూట్లలో వన్-వే ప్రయాణానికి టికెట్లు కేవలం రూ.1,299 నుంచే లభించనున్నాయి. అలానే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కూడా మంచి ఆకర్షణీయమైన ఆఫర్లు తీసుకొచ్చింది.
కాగా ఎకానమీ క్లాస్ టికెట్లు రూ.4,599 నుంచే లభిస్తుండగా.. బిజినెస్ క్లాస్ టికెట్లు రూ.9,999 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 15న ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇప్పుడు బుక్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే సంవత్సరం జనవరి 7 నుంచి మార్చి 31 వరకు ప్రయాణించే వీలు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల వారికి కూడా అనుకూలంగా కడప-హైదరాబాద్, కడప-విజయవాడ, హైదరాబాద్-సేలం, జగదల్‌పూర్-హైదరాబాద్ వంటి రూట్లతో పాటు దేశవ్యాప్తంగా అనేక కీలక మార్గాల్లో ఈ రాయితీ వర్తించనుంది.
అంతే కాకుండా అదనపు సేవలపై (యాడ్-ఆన్స్) కూడా ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఉదాహరణకు:
- సీటు సెలెక్షన్‌పై తగ్గింపు ధరలు
- అదనపు సామాను (ఎక్స్‌ట్రా బ్యాగేజీ) పైన ఆఫర్లు
- ఇన్-ఫ్లైట్ భోజనం పైన కూడా ప్రత్యేక డిస్కౌంట్లు
ఈ ఆఫర్ కింద టికెట్లను ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. అదనంగా, ప్రయాణికుల సౌలభ్యం కోసం +91 7065145858 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా బుకింగ్ సదుపాయం కల్పించబడింది. ఈ ఆఫర్ ద్వారా మధ్య తరగతి కుటుంబాలు కూడా తక్కువ ఖర్చుతో విమానయానాన్ని ఆస్వాదించే అవకాశం పొందుతారని ఇండిగో ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications