ఐదు రూపాయల లేస్ ప్యాకెట్లో 4 గ్రాముల చిప్సే.. కోర్టు సంచలన తీర్పు!
మనం చాలా సార్లు కిరాణా షాపులో చిప్స్ ప్యాకెట్ కొంటే ఫస్ట్ మనకు అనిపించే ఫీలింగ్ "ఇందులో అంతా గాలే కదా" అని. ఈ గాలిని మనం రూ.5 నుంచి రూ.20 వరకు వెచ్చింది సాధారంగా మన పిల్లల కోసం కొనుగోలు చేస్తుంటా. కవర్ల రంగులు మార్చి, లోపల గాలి మాత్రమే నింపి కస్టమర్లను బురిడీ కొట్టించే రోజుల్లో.. కంపెనీలకు ఎదురుగా ఒక సాధారణ పౌరుడు ధైర్యంగా నిలబడ్డాడు. కేవలం 5 రూపాయల చిప్స్ ప్యాకెట్‌లో జరిగిన మోసాన్ని ప్రశ్నిస్తూ న్యాయపోరాటం చేసి, ఏకంగా దిగ్గజ కంపెనీకే షాక్ ఇచ్చాడు. ప్యాకేజ్ లో ఉన్న పరిమాణానికి, లోపల ఉన్న పదార్థానికి పొంతన లేకపోవడాన్ని గమనించి వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా, ఆ కంపెనీకి తగిన బుద్ధి చెబుతూ తీర్పు వెలువడింది.
చుట్టాలకు చిప్స్ ఇస్తుండగా బయటపడ్డ అసలు రంగు!
రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన చంద్రమాన్ జలాన్ అనే వ్యాపారి తన ఇంటికి వచ్చిన అతిథులకు కోసం రూ.5 విలువైన లేస్ (Lay's) చిప్స్ ప్యాకెట్లతో సహా కొన్ని తినుబండారాలను కొనుగోలు చేశారు. అయితే చిప్స్ ప్యాకెట్ చేతిలోకి తీసుకోగానే చాలా తేలికగా అనిపించడంతో ఆయనకు అనుమానం వచ్చింది. ప్యాకెట్ పైన నెట్ వెయిట్ 15 గ్రాములు అని రాసి ఉన్నప్పటికీ, అనుమానంతో దానిలోని చిప్స్‌ను తూచి చూడగా షాకింగ్ నిజం బయటపడింది. అందులో కేవలం 4 గ్రాముల చిప్స్ మాత్రమే ఉన్నాయి.

అమ్మకం దారుని సమాధానంతో అసంతృప్తి.. ఫోరమ్‌లో కేసు!
ప్యాకెట్‌లో ఉన్న పరిమాణం చూసి షాక్ తిన్న వినియోగదారుడు, వెంటనే సదరు విక్రేతను సంప్రదించారు. అయితే వారి నుంచి ఎలాంటి సరైన స్పందన రాకపోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ 2022లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. ప్యాకింగ్‌పై రాసిన బరువు కంటే చాలా తక్కువ గ్రాములు ఇవ్వడం మోసమని ఆయన ఫోరమ్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
తయారీదారుదే పూర్తి బాధ్యత.. పెప్సికోకు షాక్!
విచారణ చేపట్టిన కమిషన్, వస్తువులను ప్యాక్ చేసి విక్రయించేటప్పుడు ఉత్పత్తుల పరిమాణంలో లోపాలు ఉంటే దానికి కేవలం తయారీ సంస్థే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. రిటైల్ షాపు వారు కేవలం ఇన్వాయిస్ ఆధారంగా విక్రయిస్తారు కాబట్టి విక్రేతపై మోపిన ఫిర్యాదును కొట్టివేసింది. నోటీసులు పంపినా తయారీ సంస్థ పెప్సికో ఇండియా ప్రతినిధులు హాజరుకాకపోవడంతో, లభించిన ఆధారాలు, ఇన్వాయిస్‌ను పరిశీలించిన ఫోరమ్ సంచలన తీర్పు ఇచ్చింది.
రూ.8,000 పరిహారం చెల్లించాలని ఆదేశం!
ఈ కేసును విచారించిన వినియోగదారుల వేదిక, వినియోగదారుడికి జరిగిన నష్టానికి, మానసిక ఆందోళనకు గాను పెప్సికో ఇండియా కంపెనీ రూ. 8,000 పరిహారం చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్యాకెట్లపై ఎక్కువ బరువు అని చూపించి తక్కువ పరిమాణంలో పదార్థాలను విక్రయించే దిగ్గజ కంపెనీలకు ఈ తీర్పు ఒక హెచ్చరికలా నిలిచింది. వినియోగదారులు తమ హక్కుల పట్ల అప్రమత్తంగా ఉంటే మోసాలను అరికట్టవచ్చని ఈ సంఘటన నిరూపించింది.














Click it and Unblock the Notifications
