జియో బంపర్ ఆఫర్: రూ.153 ప్లాన్ అప్‌గ్రేడ్, రోజూ 1 జీబీ డేటా

న్యూడిల్లీ: రిలయన్స్ జియో తన ఫోన్ వినియోగదారులకు మరో శుభవార్తను అందించింది. జియో ఫీచర్‌ పోన్‌ను రూ.153 ప్రీపెయిడ్ ప్యాక్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రటకించింది. ఈ అప్‌గ్రేడ్ చేసిన ప్యాకేజీ కింద రోజుకు 1 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది.

సంచలనాలతో జియో మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాతో రిలయన్స్ జియో ప్రవేశించింది. దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ కస్టమర్లను కాపాడుకొనేందుకు టారిఫ్ ప్లాన్లను మార్చుకోవాల్సిన పరిస్థితులను జియో కల్పించింది.

ఎప్పటికప్పుడు జియో కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. దీని కారణంగా ప్రత్యర్థి టెలికం కంపెనీలు కూడ ప్యాకేజీలను మార్చుకొంటున్నాయి. తాజాగా ఫీచర్‌ఫోన్ కోసం జియో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

 జియో ప్రీ పెయిడ్ ప్యాకేజీ అప్‌గ్రేడ్

జియో ప్రీ పెయిడ్ ప్యాకేజీ అప్‌గ్రేడ్

రూ. 153 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. అప్‌గ్రేడ్‌ చేసిన ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది.. ఈ ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ 4జీ హై స్పీడ్‌ డేటాను అందించనుంది.

 అపరిమిత వాయిస్ కాల్స్

అపరిమిత వాయిస్ కాల్స్

ఈ ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఉపయోగించుకొనే సౌకర్యం ఉంది. అయితే గతంలో ఈ ప్యాకేజీ కింద రోజుకూ 500 ఎంబీ 4జీ హై స్పీడ్ డేటా మాత్రమే లభ్యమయ్యేది. కానీ అప్‌గ్రేడ్ చేయడంతో 1 జీబీ డేటాను పొందే అవకాశం దక్కనుంది.

 రూ.24 లకే కొత్త ప్యాకేజీ

రూ.24 లకే కొత్త ప్యాకేజీ

జియో కొత్తగా రూ.24లకే కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.రూ.24 ప్యాక్‌. దీని కింద రోజుకు 500 ఎంబీ హై స్పీడ్‌ డేటా, 20 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్‌ యాక్సస్‌ను రెండు రోజుల పాటు లభ్యం కానున్నాయని ప్రకటించింది.

రూ 54 ప్యాకేజీ

రూ 54 ప్యాకేజీ

ఇక రూ.54 ప్యాక్‌. దీని కింద ఏడు రోజుల పాటు పైన పేర్కొన్న ప్రయోజనాలనే ఆఫర్‌ చేస్తుంది. కానీ ఎస్‌ఎంఎస్‌లు 70 వస్తాయి. అప్‌గ్రేడ్ చేసిన కారణంగా జియో వినియోగదారులకు మరింత ప్రయోజనం కలుగుతోందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+