ఈ పూలతో బిజినెస్ చేస్తే లక్షల్లో లాభాలు పక్కా.. ఇదే కరెక్ట్ టైమ్ !!

అందం అనగానే మొదటగా గుర్తొచ్చేది స్త్రీ.. ప్రకృతిలో ఆడవారి తర్వాత ఆ పదానికి సార్దకత తెచ్చేవి అంటే పూలు అని ముక్తకంఠంతో చెబుతారు. ఎన్నో వందల రకాల పువ్వులు ఉన్నప్పటికీ.. వాటిలో బంతిపువ్వులు ప్రత్యేకమైనవి. ఏ పండుగైనా, ఏ శుభకార్యమైనా కానీ అలంకరణలో బంతిపువ్వు తప్పనిసరిగా ఉంటుంది. ఆ పూల రంగు.. ఆ రూపం వేడుకల వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తాయి. అందుకే బంతిపూలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్లే బంతిపూల సాగు చేసే రైతులు కూడా మంచి లాభాలు పొందుతున్నారు.

దిగుబడి లెక్కలు..

ఒక ఎకరా భూమిలో సగటున 5,000 నుంచి 8,000 కిలోల వరకు బంతిపువ్వులు దిగుతాయి. కార్తీక మాసంలో కిలో ధర సుమారు రూ.200 ఉంటే.. కేవలం 5,000 కిలోల పువ్వుల ద్వారా రైతులు సుమారు రూ.10 లక్షల ఆదాయం పొందవచ్చు. దసరా, దీపావళి, కార్తీక మాసం, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంతిపూలకు డిమాండ్ ఎప్పటికీ ఎక్కువే. ఈ సమయంలో ధరలు రెట్టింపు అవుతాయి కాబట్టి రైతులు ముందుగానే సాగు సమయాన్ని ప్లాన్ చేసుకుంటే మరింత లాభాలు పొందవచ్చు.

marigolds-cultivation-and-profits-with-business-ideas

ఇదే కరెక్ట్ టైమ్..

సాధారణంగా బంతిపూల సాగులో సమయం అనేది చాలా కీలకమైన విషయం. బంతిపూల పంట 3-4 నెలల వరకు కోతకు వస్తుంది. ఈ సమయంలో రైతులు 8 నుంచి 10 సార్లు పూల కోత చేయవచ్చు. కార్తీక మాసంలో పూలు కోతకు రావాలంటే.. విత్తనాలను సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో నాటాలి. జూలై-ఆగస్టులో నాటితే వర్షాల ప్రభావం వల్ల మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సరైన కాలంలో నాటితే పువ్వులు కూడా సరైన సమయానికి చేతికందుతాయి.

విత్తనాల రకాలు..

బంతిపువ్వుల విత్తనాలు అనేక రకాలున్నా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఆఫ్రికన్ బంతి రకం విత్తనాలు వాడుతారు. ఈ రకం పువ్వులు పెద్దవిగా ఉండటంతో పాటు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. పూల దండలు, వేడుకల అలంకరణల్లో ఇవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఏపీలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు బంతిపూల ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నేల గుణం, వాతావరణ పరిస్థితులు బంతిపూల సాగుకు అనుకూలంగా ఉంటాయి.

అలానే బంతిపూలకు ఎక్కువ నీటి అవసరం ఉండదు. మొక్కలు నాటిన తర్వాత నేల తడిగా ఉండేలా నీరు పెట్టాలి. మొగ్గలు వచ్చే వరకు వారానికి రెండు సార్లు నీరు పోయాలి. కానీ పువ్వులు పూసే సమయంలో మాత్రం ప్రతిరోజూ నీరు అవసరం ఉంటుంది. పంట నాణ్యతను మెరుగుపరచడానికి సాగు సమయంలో సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. అదనంగా యూరియా, డీఎపీ, పొటాష్ సరైన మోతాదులో వేస్తే పూల దిగుబడి పెరుగుతుంది. పూత సమయంలో ఫోలియర్ స్ప్రే వాడితే పువ్వుల రంగు, పరిమాణం మెరుగుపడతాయి.

marigolds-cultivation-and-profits-with-business-ideas

మరోవైపు బంతిపూల తోటలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, ముల్లంగి, క్యారెట్ వంటి కూరగాయలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఇవి అదనపు ఆదాయం ఇవ్వడమే కాకుండా, నేల సారాన్ని కూడా కాపాడుతాయి. అందుకే కొత్తగా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసే వారు ఈ రకంగా కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+