సామాన్యుడిపై మరో భారం: పాల ధరలు రేపటి నుంచే పెంపు!

సెప్టెంబర్ 1, 2026 నుంచి ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా గేదె పాల ధరలు భారీగా పెరగనున్నాయి. బొంబాయి పాల ఉత్పత్తిదారుల సంఘం టోకు ధరను లీటరుకు రూ.9 నుంచి రూ.102కు చేర్చింది. దీని ప్రభావంతో రీటైల్ మార్కెట్లో విక్రేతలు, ప్రాంతాన్ని బట్టి లీటరు గేదె పాల ధర రూ. 110 నుంచి రూ.112 వరకు చేరనుంది. ముఖ్యంగా దక్షిణ ముంబై ప్రాంతవాసులు అత్యధికంగా రూ.112 చెల్లించాల్సి రానుంది. ఈ పెంచిన టోకు ధర సవరణ 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుందని పాల ఉత్పత్తిదారుల సంఘం స్పష్టం చేసింది.

FSSAI: ఫుడ్ ప్యాకెట్లపై ఇకపై రెడ్ మార్క్. కొత్త రూల్స్, త్వరలోనే కొత్త చట్టం!
FSSAI: ఫుడ్ ప్యాకెట్లపై ఇకపై రెడ్ మార్క్. కొత్త రూల్స్, త్వరలోనే కొత్త చట్టం!

ధరల పెంపునకు ప్రధాన కారణాలు
పశువల మేత, ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఉత్పత్తిదారులు వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంలో ధాన్యం, కంది చుని, శనగ చుని, మొక్కజొన్న, పచ్చి మేత ధరలు దాదాపు 25 శాతం వరకు పెరిగాయి. దీనికి తోడు ఇంధనం, రవాణా, కార్మికుల కూలీ, నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఒక లీటరు పాలు ఉత్పత్తి చేయడానికి రూ.98 వరకు ఖర్చు అవుతోందని, పాత రేట్లతో నష్టాలు వస్తున్నాయని వారు వివరించారు. ముంబైలో ప్రతిరోజూ దాదాపు 40 లక్షల లీటర్ల గేదె పాలు విక్రయం అవుతుండటంతో ఈ ధరల సవరణ నిర్ణయానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

Mumbai Milk Price Hike Buffalo Milk To Cost Up To Rs 112 Litre From September 1 Full Details Here

వివిధ ప్రాంతాల్లో మారిన పాల రేట్లు
ఈ సవరణ ప్రకారం టోకు ధర రూ.93 నుంచి రూ.102కి పెరిగింది. రీటైల్ విభాగంలో దక్షిణ ముంబై ప్రాంతంలోని తబేలా పాలు లీటరు రూ.104 నుంచి రూ.112కి పెరగగా.. ముంబైలోని ఇతర ప్రాంతాల్లో రూ.100 నుంచి రూ.110కి చేరాయి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా గోకుల్ ప్యాకెట్ గేదె పాల ధర( ముంబై, పుణె) ఇప్పటికే ఆగస్టులోనే లీటరుకు రూ.76 నుంచి రూ.78కి పెరిగి అమల్లో ఉంది.

భారీగా పెరగనున్న పాల ధరలు.. సెప్టెంబర్ 1 నుంచి లీటర్ ఎంతో తెలుసా?
భారీగా పెరగనున్న పాల ధరలు.. సెప్టెంబర్ 1 నుంచి లీటర్ ఎంతో తెలుసా?

సామాన్యులపై నిత్యావసరాల భారం
వినాయక చవితితో ప్రారంభమయ్యే పండుగ సీజన్ ముంగిట పాల ధరలు పెరగడం సామాన్య కుటుంబ బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం పాల ధరలు మాత్రమే కాకుండా ఇటీవలే ముంబైలో చక్కెర ధరలు కూడా కిలోకు రూ.50 నుంచి రూ.58 వరకు పెరిగాయి. రోజువారీ వాడే పాలు, పంచదార రెండూ ప్రియం కావడంతో టీ, పిండి వంటల తయారీ ఖర్చులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారం తట్టుకోలేక కొందరు ఆవు పాల వైపు మారాలని భావిస్తున్నప్పటికీ.. రుచి కారణాల వల్ల గేదె పాలనే అలవాటు పడినవారికి ఈ నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+