ఓలా, ఉబెర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఇకపై లేడీ డ్రైవర్ కావాలంటే ఓకే!

దేశంలోని క్యాబ్ ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025'ను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్‌లలో ఇకపై మహిళా ప్రయాణికులు తమకు నచ్చిన విధంగా మహిళా డ్రైవర్లను ఎంచుకునే సదుపాయం కల్పించారు.

1. 'జెండర్ సెలక్షన్' డ్రైవర్ ఫీచర్
కొత్త నిబంధనల ప్రకారం.. క్యాబ్ సంస్థలు తమ యాప్‌లలో 'జెండర్ సెలక్షన్' ఆప్షన్‌ను తప్పనిసరిగా చేర్చాలి. మహిళా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా భావించేందుకు మహిళా డ్రైవర్‌ను ఎంచుకోవచ్చు. అయితే ప్రస్తుతం దేశంలో మహిళా డ్రైవర్ల సంఖ్య 5శాతం కంటే తక్కువగా ఉన్నందున, ఈ ఆప్షన్ డ్రైవర్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల వెయిటింగ్ టైమ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Ola Uber Introduce Female Driver Choice Option New Motor Vehicle Aggregator Guidelines 2025 Explained

2. డ్రైవర్లకు 100 శాతం టిప్
టిప్పింగ్ విధానంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త నియమాలను రూపొందించింది. ప్రయాణికులు ఇచ్చే టిప్‌లో క్యాబ్ కంపెనీలు ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు. ఆ మొత్తం నేరుగా డ్రైవర్ ఖాతాకే వెళ్లాలి. బుకింగ్ సమయంలో కాకుండా ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే టిప్ ఇచ్చే ఆప్షన్ కనిపిస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టానికి విరుద్ధంగా ప్రయాణికులను టిప్ ఇవ్వమని ఒత్తిడి చేయకూడదు.

3.ధరల పెంపుపై నియంత్రణ
క్యాబ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. పీక్ అవర్స్‌లో కూడా బేస్ ఫేర్ (సాధారణ ధర) కంటే రెట్టింపు (2x) కన్నా ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదు. బేస్ ఫేర్ కంటే 50 శాతం తక్కువ వరకు కూడా ధరలను తగ్గించుకునే వెసులుబాటు ఉంది.

4. డెడ్ మైలేజీ ఛార్జీల రద్దు
డ్రైవర్ పికప్ పాయింట్‌కు చేరుకోవడానికి అయ్యే ఖర్చును ప్రయాణికుల నుంచి వసూలు చేయకూడదు. కేవలం 3 కిలోమీటర్ల లోపు దూరం ఉంటేనే పరిమితంగా ఛార్జీలు వసూలు చేయాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీల లైసెన్సులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.ఈ కొత్త మార్గదర్శకాలు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు భద్రతను పెంచడమే కాకుండా, క్యాబ్ డ్రైవర్ల ఆదాయాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చూడడానికి సహాయపడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+