OnePlus కస్టమర్లకు అలర్ట్. మూసివేతపై కీలక నిర్ణయం
భారత్‌లో వన్‌ప్లస్ మొబైల్ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయన్న వార్తలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. "ఇక వన్‌ప్లస్ ఫోన్లు భారత్‌లో లభించవు", "సర్వీస్ సెంటర్లు మూతపడతాయా?" అనే అనుమానాలతో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. టెక్ వర్గాల్లో మొదలైన ఈ చర్చ, కాసేపటికే వాట్సాప్ గ్రూపులు, ట్విట్టర్ టైమ్‌లైన్‌లను చుట్టేసింది.
ఇప్పటికే వన్‌ప్లస్ ఫోన్ వాడుతున్నవారు, కొత్తగా కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇది నిజమైతే పరిస్థితి ఏంటి? అన్న సందేహాలు పెరిగాయి. ఈ దశలోనే వన్‌ప్లస్ కంపెనీ నుంచి వచ్చిన అధికారిక స్పందన ఈ ప్రచారానికి పూర్తిగా బ్రేక్ వేసింది.

ఈ వార్తలపై వన్‌ప్లస్ ఇండియా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. భారత్‌లో తమ కార్యకలాపాలు ఎక్కడా ఆగడం లేదని, కంపెనీని మూసేస్తున్నామన్న ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని తేల్చి చెప్పింది. వన్‌ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియూ మాట్లాడుతూ, "భారత్ వన్‌ప్లస్‌కు అత్యంత కీలకమైన మార్కెట్. ఇక్కడి నుంచి వెళ్లే ఆలోచనే లేదు" అని స్పష్టం చేశారు.
ఎలాంటి ఇబ్బందులు ఉండవు..
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు, కొత్త మోడళ్ల లాంచ్‌లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్(ALL) అన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఉన్న వినియోగదారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సర్వీస్ సపోర్ట్ పూర్తిగా అందుబాటులోనే ఉంటుందని హామీ ఇచ్చింది.
ఎలాంటి సంబంధం లేదు..
ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ పెరగడం, కొన్ని బ్రాండ్లు భారత్‌లో తమ కార్యకలాపాలను తగ్గించడం వంటి కారణాలతో వన్‌ప్లస్‌పై కూడా ఊహాగానాలు మొదలయ్యాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారానికి వాస్తవాలతో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టత ఇవ్వడంతో గందరగోళం తొలగింది.
మొత్తానికి, వన్‌ప్లస్ భారత్‌ను విడిచిపెడుతోంది అన్న వార్తల్లో నిజం లేదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వినియోగదారులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, భారత్‌లో వన్‌ప్లస్ ప్రయాణం మరింత బలంగా కొనసాగుతుందని సంస్థ తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications