2018లో బడ్జెట్: సౌర విద్యుత్ లక్ష్యాలు ఘనం.. పెట్టుబడుల సేకరణే క్లిష్టం

న్యూఢిల్లీ: భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపుదలకు ప్రణాళికలు రూపొందించామని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు ప్రారంభోత్సవంలో చెప్పారు. 2030 నాటికి భారత్ విద్యుత్ అవసరాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 40% సమకూర్చాలన్నది లక్ష్యం. 2022 నాటికి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతేడాది నవంబర్ నెలలో ప్రకటించారు. ఇందులో సౌర విద్యుత్ ద్వారా 100 గిగావాట్ల విద్యుత్, పవన విద్యుత్ ద్వారా 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
కానీ లక్ష్య సాధన ఎలాగన్న సందేహం తలెత్తుతున్నది. అందుకు అవసరమైన పెట్టుబడుల సేకరణకు లక్ష్యాల సాధన ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం 350 మిలియన్ల డాలర్లు అవసరం. ఇప్పటికీ ఆ లక్ష్యాల సాధనకు సుదూరంలో ఉన్నామంటే అతిశయోక్తి కాదు

జల, బయో విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 12.4 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం

జల, బయో విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 12.4 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం

2017 డిసెంబర్ 15వ తేదీ నాటికి భారతదేశంలో 16.68 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని నూతన సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి ఆర్ కే సింగ్ ఈ నెల నాలుగో తేదీన ప్రకటించారు. దీనికి తోడు 33 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం గల పవన విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పామని చెప్పారు. వీటితోపాటు చిన్న జల విద్యుత్, బయో విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రెండు పద్ధతుల ద్వారా 2017నాటికి 12.4 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మిస్తామని ప్రకటించిన మంత్రి ఆర్కే సింగ్.. ఇప్పటి వరకు ఎంత సామర్థ్యం గల విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ప్రారంభించారన్న సంగతి చెప్పలేదు.

ఏటా 37.67 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమేనా?

ఏటా 37.67 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమేనా?

చైనా, అమెరికా తర్వాత విద్యుత్ వినియోగదారులు అత్యధికంగా ఉన్న 200 మిలియన్ల వినియోగదారులు గల దేశంగా భారత్ నిలిచింది. మరో మూడు సంవత్సరాల్లో సంప్రదాయేతర ఇందన వనరులద్వారా 113 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ప్రకారం ఏటా 37.67 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్లలో సుమారు 27 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటైతే.. వచ్చే మూడేళ్లలో ఏటా 37.67 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రశ్నార్థకమేనా? అన్న నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

2030 నాటికి 40 శాతం విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్

2030 నాటికి 40 శాతం విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్

ఇది చాలా కఠినమైన సవాల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత మార్కెట్‌లో సౌర విద్యుత్ విధానం అమలులోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన సంస్థలు చెబుతున్నాయి. వాస్తవాలను నిరాకరించలేమని, అసాధారణ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని ఏటీ కేర్నేయ్ పార్టనర్ నితిన్ చంద్ర తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి దేశీయ అవసరాల మేరకు 40 శాతం సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ప్రకటించింది. కానీ 2017 నాటికి 18.2 శాతం లక్ష్యం చేరుకున్నది. లక్ష్య సాధన దిశగా ప్రయాణం చేయాలంటే కఠిన పరీక్ష వంటిదని నిపుణులు చెప్తున్నారు. కొన్ని నెలల తర్వాత నాలుగు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి టెండర్లను పిలిచింది. ఈ నెల తొలివారంలో భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్ఈసీఐ) మొత్తం 1200 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 750 మెగావాట్లు, కర్ణాటకలో 200 మెగావాట్లు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 275 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యం.

15 వేల మెగావాట్ల లక్ష్యానికి 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

15 వేల మెగావాట్ల లక్ష్యానికి 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

సౌర విద్యుత్ ఉత్పత్తి గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో దారుణంగా పడిపోయింది. 2017 డిసెంబర్ నాటికి 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్ప్తత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 3000 మెగావాట్ల సౌర విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. ఆరు గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 5.53 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలిగింది. 2018లో సౌర విద్యుత్ 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఒక విద్యా సంస్థ అధ్యయనం ప్రకారం విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులను స్థాపించడానికి కనీసం 12,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు అవసరం. 2015లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాలని భారత్ లక్ష్యం నిర్దేశించుకున్నది. ఇక సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం 350 మిలియన్ డాలర్ల నిధులు అవసరం ఉన్నది. కానీ ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు లక్ష్యాల సాధనకు ఎంత కాలం పడుతుందన్న సంగతి ప్రశ్నార్థకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+